Cricket Josh IPL థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా.. post thumbnail image

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించిన‌ట్టుగానే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్క‌లుంటాయి అవి ఇప్పుడు అప్ర‌స్తుతం. థ‌లా టీమ్‌లో ఉండ‌ట‌మే సీఎస్కేకి కావాలి. అన్‌క్యాప్డ్ ఐతే ఏంటి? అస‌లు క్యాప్డ్ ఐతే ఏంటి? స‌రే అన్‌క్యాప్డ్ ఎందుక‌య్యాడ‌నే విష‌యం చాలా మందికి తెలిసినా, మ‌రొక‌సారి గుర్తు చేసుకుందాం..బీసీసీఐ కొత్త రూల్స్ ప్ర‌కారం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు 5 సంవ‌త్స‌రాల పాటు దూరంగా ఉన్న ఏ ప్లేయ‌ర్ ఐనా అన్‌క్యాప్డ్ గా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాడు. ధోని విష‌యంలోనూ అంతే..ఇప్పుడ‌స‌లు టాపిక్ ఏంటంటే ధోని టీమ్‌లో ఏం చేస్తాడు..నెంబ‌ర్ 3లో ఆడ‌తాడా? ఫినిష‌ర్ రోల్ ప్లే చేస్తాడా? వికెట్ కీపింగ్ చేస్తాడా? అనే డౌట్స్ వ‌స్తాయి..వాటికి స‌మాధానం….

ఈ ఒక్క‌డుంటే చాలు టీమ్‌ను మొత్తం ఫుల్లుగా మోటివేట్ చేసి ఫ్యూచ‌ర్‌లోనూ చాంపియ‌న్ జ‌ట్టుగా నిల‌బ‌డేందుకు కృషి చేస్తాడు. ఇంక ఎన్ని సీజ‌న్లు అంటే చెప్ప‌లేం..ఏజ్ ఈజ్ జ‌స్ట్ నెంబ‌ర్‌. మ‌హీకి ఆట‌గాడిగా ఓపిక ఉన్నంత వ‌ర‌కు సీఎస్కేలోనే ఉంటాడు. ఆ త‌ర్వాత మెంటార్‌గా ఉంటాడా? కోచ్‌గా కొన‌సాగుతాడా అనేది మ‌హీ ఇష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ప‌టేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్ప‌టేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెన‌ర్లు ఫిల్‌సాల్ట్, విరాట్ కోహ్లీ. అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఓవ‌ర్‌లోనే బౌలింగ్‌కు దిగాడు. ఐన‌ప్ప‌టికీ స్కోర్ వేగం త‌గ్గ‌లేదు. ముఖ్యంగా

రంగంలోకి స్వ‌ప్నిల్..?రంగంలోకి స్వ‌ప్నిల్..?

గ‌త సీజ‌న్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేర‌డంలో త‌న‌దైన రోల్ పోషించిన‌ స్వ‌ప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జ‌ర‌గబోయే మ్యాచ్‌లో స్వ‌ప్నిల్ ఆడే అవ‌కాశాలున్నాయి. ఇప్ప‌టికే సుయాశ్‌శ‌ర్మ‌, కృనాల్‌పాండ్య ఉండ‌గా

ర‌షీద్ వికెట్ తీశాడోచ్..ర‌షీద్ వికెట్ తీశాడోచ్..

ఆఫ్గ‌న్ స్పిన్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్..ప్ర‌పంచంలో ఎక్క‌డ క్రికెట్ లీగ్ జ‌రిగినా అక్క‌డ త‌నుంటాడు. లెక్క‌లేన‌న్ని వికెట్లు త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ ర‌షీద్‌ఖాన్‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ