రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జాస్ బట్లర్..ఆ ఫ్రాంచైజీని వదిలి ఆక్షన్‌లోకి రావాలనుకుంటున్నాడట. ఒకవేళ అదే జరిగితే ఈసారి జరగబోయే మెగా ఆక్షన్‌లో ఇతడికి జాక్‌పాట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా ఉన్నాయి. అందులో ఆర్సీబీ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే ఓపెనింగ్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెస్సీని రిలీజ్ చేయాలనుకుంటున్న ఆర్సీబీ..ఆ స్థానాన్ని బట్లర్‌తో భర్తీ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదు. విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అప్పగించేందుకు రెడీ అయిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టీమ్‌ను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చూస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను తీసుకున్నా..బట్లర్‌నూ దక్కించుకునే చాన్స్ ఉంది. ఎందుకంటే ఆసీస్ విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వదులుకోవాలని ఆర్సీబీ డిసైడైంది. గత సీజన్‌లో అతడు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. డుప్లెస్సీ, మ్యాక్స్‌వెల్‌ను వదులుకుని ఆక్షన్‌లో బట్లర్‌ను తీసుకుంటే సరి. ఎలాగూ విల్ జాక్స్ ఉండనే ఉన్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ కోసం మరొక ఆల్‌రౌండర్‌ను తీసుకుంటే, ఆర్సీబీ ఫారిన్ కోటా బ్రహ్మాండంగా తయారవుతుంది.
బట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్‌కే

Related Post

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే

దేవుడ్‌లా ఆదుకున్నాడు..దేవుడ్‌లా ఆదుకున్నాడు..
హోమ్ గ్రౌండ్.. ఫస్ట్ బ్యాటింగ్..ఇదేదో కలిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వర్షం కారణంగా కుదించిన 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50,

ఇది కూడా పాయే..ఇది కూడా పాయే..
పిచ్ మారింది..ఫలితం మారలేదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో ఓటమి..మనోళ్లు బ్యాటింగ్ చేస్తున్నపుడు స్లో వికెట్ కదా..150 ప్లస్ స్కోర్ సరిపోవచ్చులే అనుకున్నారు. పవర్ ప్లేలో 4 ఓవర్లకు 16 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినపుడు..ఇక మ్యాచ్ మనదే అనుకున్నాం..కానీ