Cricket Josh Matches డ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి

డ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి

డ‌కౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి post thumbnail image

తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో జ‌రుగుతున్న అన‌ధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఏడో నెంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి ర‌న్స్ చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ త‌ర‌పున ఏ ఒక్క‌రూ హాఫ్ సెంచ‌రీ చేయ‌లేక‌పోయారు. మొత్తంగా ఇండియా ఏ 107 ర‌న్స్‌కు ఆలౌట్ అయింది. అంత‌కు ముందు టీ20 సిరీస్‌లో నితీశ్‌కుమార్ ఇర‌గ‌దీయ‌డంతో అత‌డిపై అంద‌రిలోనూ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి, త‌ప్పులేదు ఇది ఇండియా క‌దా అలాగే ఉంటుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్న‌పుడు కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌నలే ఇచ్చాడు. అప్ప‌ట్నుంచి వెలుగులోకి వ‌చ్చాడు నితీశ్. దిగ్గ‌జాల ప్ర‌శంలు అందుకోవ‌డం, టీమిండియాలో చోటు ద‌క్కించుకోవ‌డం, అక్క‌డ కూడా స‌త్తాచాట‌డం..ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఐతే అస‌లైన ఆట ఇప్పుడు మొద‌లైంది..కోచ్ గంభీర్ కొంద‌రు యువ ఆట‌గాళ్ల‌ను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆస్ట్రేలియా సిరీస్‌కు కావాల‌న్నాడు. ఎందుకంటే ఇండియాలో ఆడి మెప్పించ‌డం ఒకెత్తు, విదేశాల్లో ఆడి మెప్పించ‌డం మ‌రొకెత్తు. ఆసీస్ కండీష‌న్స్‌కు అల‌వాటుప‌డాలి, అక్క‌డి బౌన్స్‌, పేస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోగ‌ల‌గాలి, అప్పుడే వారిలోని స్కిల్స్ బ‌య‌టకొస్తాయి. భ‌విష్యత్ త‌రం కోసం గంభీర్ చురుకుగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ‌..నితీశ్ కుమార్ టీమిండియా నెక్ట్స్ హోప్‌గా మారే ప్ర‌య‌త్నం చేస్తే తెలుగు అభిమానుల‌కు కావ‌ల్సిందేముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

యువీ 6 సిక్స్‌లు కొట్టిన నేల‌..యువీ 6 సిక్స్‌లు కొట్టిన నేల‌..

2007 టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో యువ‌రాజ్‌సింగ్ 6 బాల్స్‌లో 6 సిక్స‌ర్లు కొట్టిన సీన్‌..ఇప్ప‌టికీ ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. ఆ అద్భుతం జ‌రిగింది సౌతాఫ్రికాలోని డ‌ర్బ‌న్‌లో.. ఆ ఫీట్‌కు 17 ఏళ్లు పూర్తైనా..మ‌రోసారి గుర్తుకొస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య తొలి టీ20

ఓహో..తెలుగోళ్ల‌కు ఆ రూట్ ఇదేనా?ఓహో..తెలుగోళ్ల‌కు ఆ రూట్ ఇదేనా?

ఎక్క‌డి వాళ్ల‌నైనా ఓన్ చేసుకునే మంచిత‌నం తెలుగు అభిమానుల‌కు ఉంది. అది సినిమాలోనైనా, ఆట‌లోనైనా..స‌రే మ‌న‌కు ఈ వేదిక‌పై సినిమా టాపిక్ కాదు కాబ‌ట్టి, అది వ‌దిలేద్దాం. క్రికెట్ విష‌యానికొస్తే.. అదీ తెలుగు ప్లేయ‌ర్స్ ఆడుతుంటే..అభిమానుల‌ను ఆప‌త‌ర‌మా..ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు గ‌డ్డ

టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్టీమిండియాలో కొన‌సాగుతున్న‌ ధోనీ ట్రెండ్

బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా సంబ‌రాలు చూసే ఉంటారంతా.. కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ ట్రోఫీని ఆకాశ్‌దీప్‌కు ఇవ్వ‌డంతో అత‌డే ట్రోఫీని లిఫ్ట్ చేస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చాడు. ఇవాళ ఏ న్యూస్ పేప‌ర్ వెబ్‌సైట్‌లో చూసిన అవే ఫొటోలు..టీవీల్లో అవే విజువ‌ల్స్.