లక్నో సూపర్ జెయింట్స్ వదులుకునేందుకు సిద్ధపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జరిగాయట. కేఎల్ రాహుల్ నమ్మ కన్నడిగ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో బజ్ మొదలైంది. ఈ క్లాసీ ప్లేయర్ ఆర్సీబీలో అడుగుపెట్టడం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక కింగ్ విరాట్ కోహ్లీకే నాయకత్వ బాధ్యతలు మరోసారి అప్పగించేందుకు ఆర్సీబీ రెడీ అయింది. అంతకు ముందు ఫాఫ్ డుప్లెస్సీ కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే. ఫాఫ్‌ను రిలీజ్ చేయడమూ ఖాయమే. ప్రస్తుతానికైతే ఆర్సీబీ మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ విషయంలోనే క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వాళ్లలో మహ్మద్ సిరాజ్‌ను కంటిన్యూ చేసే అవకాశాలు లేకపోలేదు. రజత్ పటిదార్, విల్ జాక్స్, స్వప్నిల్ సింగ్ గత సీజన్‌లో మంచి పెర్ఫార్మెన్ ఇచ్చారు. ఐతే ఆర్టీఎమ్ (రైట్ టు మ్యాచ్) ఉండటంతో ఆక్షన్‌లో వీళ్లలో ఎవరైనా సరిపోయే ధరకు అందుబాటులోకి వస్తే తీసుకోవచ్చు. మొత్తానికి కన్నడ అభిమానులు మాత్రం నమ్మ కింగ్..నమ్మ రాహుల్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాను స్లోగన్స్‌తో దంచేస్తున్నారు.
ఇటు కింగ్..అటు కేఎల్ కమింగ్..

Related Post

భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిసింది.పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ (81) తో దుమ్మురేపగా, విధ్వంస ప్రేమికుడు నికోలస్ పూరన్ కేకేఆర్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు.

అయ్యో..ఫిలిప్స్అయ్యో..ఫిలిప్స్
గ్లెన్ ఫిలిప్స్..ధనాధనా సిక్సర్లు కొట్టమంటే, సిక్సర్లు కొడతాడు. స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయమంటే వికెట్లు తీస్తాడు, కనీసం బ్యాటర్లను కట్టడైనా చేస్తాడు..క్యాచ్‌లు పట్టుకోవాలంటే నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌లు పట్టుకుంటాడు. ఫిల్డింగ్ చేసి రన్స్ ఆపాలంటే డైవ్ చేసి మరి

ఇటలీ నుంచి తొలిసారిగా..ఇటలీ నుంచి తొలిసారిగా..
నవంబర్ 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అంతా సిద్ధమైంది. ఆటగాళ్లు కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 1574 మంది ఆటగాళ్లు ఆక్షన్ లిస్ట్‌లో తమ పేరును నమోదు చేసుకోగా, ఇందులో