మరోకొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్పటికే మిగతా జట్లు కనీసం ఒకరిద్దరి విషయంలో క్లారిటీకి వచ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా రోహిత్‌శర్మ ఆటగాడిగా కంటిన్యూ అవుతాడా అనేది బిగ్ క్వశ్చన్. ఇక సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ముంబైకి కూడా కెప్టెన్సీ చేస్తే బాగుంటుందని మనసులో ఉంటుంది కదా..అదేమైనా మేనేజ్మెంట్‌కు చెప్పేసాడా? ఇక జస్ప్రిత్ బుమ్రా కూడా ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. తను ఆల్రెడీ టీమిండియాకు వైస్ కెప్టెన్‌గానూ చేస్తున్నాడు. మరి తను కూడా ఆశపడటంలో తప్పులేదు. ఇక గతేడాది కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యను ఫ్రాంచైజీ అలాగే కంటిన్యూ చేస్తుందా? అదే జరగాలంటే రిటైన్ చేసుకోవాల్సిందే. పాండ్యపై కొత్తలో వ్యతిరేకత వచ్చినా, టీ20 వరల్డ్‌కప్ గెలుపు తర్వాత అభిమానులు అతడిపై ప్రేమ చూపించారు. కానీ ముంబై ఇండియన్స్ విషయంలో, అది కూడా రోహిత్ విషయంలో మాత్రం అభిమానులు తగ్గేదేలే అంటారు. రోహిత్ ప్లేయర్ గా ఉండి, పాండ్య కెప్టెన్‌గా ఉండటం ఫ్యాన్స్‌కు నచ్చదు. పోనీ పాండ్యను తప్పిస్తారా అంటే ముంబై ఫ్రాంచైజీ సుముఖంగా ఉన్నట్టు లేదు. అన్నిటికీ మించి సూర్యకుమార్, బుమ్రా విషయంలోనూ క్లారిటీ లేదు. వాళ్లు ఆక్షన్‌లోకి వెళితే కోట్లు కొల్లగొట్టడం గ్యారెంటీ. మరి ముంబై ఏం చేస్తుందో..
ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?

Related Post

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

రుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోనిరుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోని
వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

నువ్వేం చేశావో అర్థమవుతోందా..?నువ్వేం చేశావో అర్థమవుతోందా..?
ఇషాన్ కిషన్ .అతి పెద్ద పొరపాటు చేసి క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అప్పటికే సన్‌రైజర్స్ టీమ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్పలు పడుతోంది. ఆ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ చహార్ బౌలింగ్‌లో