2012 ముందు వరకు టీమిండియా స్వదేశంలో టెస్ట్‌లు గెలవడం, ఓడటం…సిరీస్‌లు గెలవటం, ఓడటం అప్పుడప్పుడూ జరుగుతూ ఉండేది, కానీ విరాట్ శకం మొదలయ్యాక సీన్ మారిపోయింది. ఓటమే లేదు. టెస్ట్ మ్యాచ్ ఓడినా, ఆ సిరీస్ మాత్రం గెలిచేవారు. 2022 నుంచి రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ చేపట్టాక కూడా అదే గెలుపు ఫార్ములా కొనసాగింది. అలా మొత్తంగా గడిచిన 12 ఏళ్లలో స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌లు గెలిచిన ఘనత టీమిండియాది. ఆ జైత్రయాత్రకు న్యూజిలాండ్ ముగింపు పలికింది. పుణెలో జరిగిన రెండో టెస్ట్‌ను మూడు రోజుల్లోనే ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 రన్స్ చేస్తే..ఇండియా 156 రన్స్‌కే కుప్పకూలింది. అక్కడ మొదలైంది పతనం..ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 255 రన్స్ చేసి ఇండియాకు 359 రన్స్ టార్గెట్ ఇచ్చింది. కివీస్ స్పిన్నర్ల ధాటికి 245 రన్స్ కే కుప్పకూలి 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
న్యూజిలాండ్ 259 & 255 | ఇండియా 156 & 245
1955 లో న్యూజిలాండ్ తొలిసారి ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవగా, 69 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గెలిచింది. కివీస్ ఆనందానికి అవధుల్లేవు, ఎందుకంటే వాళ్లు రీసెంట్‌గా శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయి వచ్చారు. ఆ లోటును టెస్టుల్లో నెంబర్ వన్ టీమ్‌ను ఓడించడం ద్వారా సంతోషంగా మార్చుకున్నారు. అది కూడా మనకు నచ్చినట్టు తయారుచేసిన స్పిన్ పిచ్‌లపై మనల్నే ఓడించి వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నారు.