Cricket Josh Matches స‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడి

స‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడి

స‌న్‌రైజ‌ర్స్‌కు ‘డ‌బుల్’ ఒత్తిడి post thumbnail image

అబ్దుల్ స‌మ‌ద్‌, రీసెంట్‌గా రంజీ మ్యాచ్‌లో రెండు సెంచ‌రీలు చేశాడు. జ‌మ్మూ క‌శ్మీర్ త‌ర‌పున ఆడుతున్న యంగ్ బ్యాట‌ర్ ఒడిశాపై రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచ‌రీలు బాదాడు. మంచి విష‌య‌మే క‌దా, ఐతే తెలుగు అభిమానుల్లోనూ కొంద‌రు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇత‌డు ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్నాడు. ఎందుకు ఆడిస్తున్నారు అంటూ ఇత‌నిపై ప్ర‌తీ సీజ‌న్‌లో విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉంటాయి అదే వేరే విష‌యం. ఐనా స‌రే ఫ్రాంచైజీ పెద్ద‌గా ప‌ట్టించుకోదు, ఆట‌గాడూ ప‌ట్టించుకోడు, స‌రే ప‌ట్టించుకోవ‌ద్దు కూడా. ఐతే ఇప్పుడు స‌మ‌ద్ విష‌యంలో స‌న్‌రైజ‌ర్స్ పై కొంత ఒత్తిడి ఉంది. రిటైన్ లిస్ట్ అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు బీసీసీఐకి పంపించాలి. ఇప్ప‌టికే ఎవ‌రెవ‌రిని రిటైన్ చేసుకోవాల‌నే విషయంపై స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది.

ట్రావిస్ హెడ్, ప్యాట్ క‌మిన్స్, అభిషేక్ శ‌ర్మ‌, హెన్రిక్ క్లాసెన్ ఎలాగూ క‌న్ఫ‌ర్మ్ అంటున్నారంతా.. నితీశ్ కుమార్‌రెడ్డిని కూడా వ‌దులుకోదు. ఇప్ప‌టికీ ఐదుగురు అయ్యారు. వీళ్లంతా ఆల్రెడీ క్యాప్డ్ ప్లేయ‌ర్స్ (దేశానికి ఆడిన వాళ్లు). ఇక మిగిలింది అన్‌క్యాప్డ్ కోటా..అబ్దుల్ స‌మ‌ద్ ఈ కోటా కింద‌కే వ‌స్తాడు. ప్ర‌స్తుతం స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌లో ఉన్న అన్‌క్యాప్డ్ ఆట‌గాళ్ల‌లో స‌మ‌ద్ ఒక్క‌డే ఈ ఫ్రాంచైజీకి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అందుకే ఇత‌న్ని బ్యాక్ చేసే చాన్స్ ఉంది. ఐతే కొత్త రూల్స్ ప్ర‌కారం అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌ను రిటైన్ చేసుకోవాలంటే 4 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. మ‌రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స‌మ‌ద్‌పై 4 కోట్లు పెడుతుందా? లేక ఆక్ష‌న్‌లోకి రిలీజ్ చేసి ఆర్టీఎం ద్వారా తిరిగి ద‌క్కించుకుంటుందా? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండ‌బోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ల‌క్‌..నో అంటే లోక‌ల్ ఓకేనాల‌క్‌..నో అంటే లోక‌ల్ ఓకేనా

ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ త‌మ జ‌ట్టును వ‌దిలేయ‌నున్నాడు..ల‌క్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఐపీఎల్‌ మెగా ఆక్ష‌న్ న‌వంబ‌ర్ 25, 26 తేదీల్లో సౌదీలో జ‌ర‌గ‌నుంది. మెగా ఆక్ష‌న్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు త‌మ రిటెన్ష‌న్

ఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకునిఆ ఒక్క షాట్‌తో..రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని

జ‌స్ట్ ఇమాజిన్, ఒక బ్యాట్స్‌మ‌న్ ఒక షాట్ అద్భుత‌మైన రీతిలో కొడితే క్రికెట్ ప్ర‌పంచ‌మంతా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా న‌డుచుకుంటూ ఎక్క‌డికో వెళ్తుంటే.. గూస్ బంప్స్ వ‌చ్చేలా ఆడిన ఇన్నింగ్స్‌లు ఎన్నో ఉన్నాయి..కానీ ఆ ఒక్క షాట్ క్రికెట్

కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..

రోహిత్‌శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా..రిటైర్ అయితే మంచిద‌ని ఉచిత స‌లహాలిస్తున్నారు, ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కానీ ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన టీమిండియాకు ఎన్నో విజ‌యాలు అందించిన ఆట‌గాళ్ల‌ను ఇలా విమ‌ర్శించ‌డం క‌రెక్ట్ కాదు. నిజానికి మ‌నం