ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ జట్టును వదిలేయనున్నాడు..లక్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 25, 26 తేదీల్లో సౌదీలో జరగనుంది. మెగా ఆక్షన్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను బీసీసీఐకి పంపాల్సి ఉంటుంది. అది కూడా అక్టోబర్ 31 డెడ్ లైన్. అందుకే అన్ని ఫ్రాంచైజీలు తమ లిస్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా టెస్ట్ సిరీస్‌లో ఫెయిల్ అవుతున్న కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ చేయనుంది. అందరూ ముందు నుంచీ అనుకున్నట్టే ఆర్సీబీ కేఎల్ రాహుల్‌ను తీసుకుంటుందా? ఇంకా ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది వేచి చూడాలి. బెంగళూరు లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్..ఐపీఎల్‌లోనూ ఇంపాక్టబుల్ ఇన్నింగ్స్ ఆడింది లేదు, వికెట్ కీపర్‌గానూ ఇన్ అండ్ ఔట్స్ ఉంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్..ఆ టీమ్‌లో క్వింటన్ డికాక్ ఆడటం వల్ల అతడే వికెట్ కీపింగ్ చేశాడు. మరోవైపు ఆర్సీబీకి ఇన్నాళ్లు వికెట్ కీపర్‌గా చేసిన దినేశ్ కార్తీక్..గతేడాదే రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి ఆర్సీబీ అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకుని వికెట్ కీపర్ పొజిషన్ భర్తీ చేస్తుందా? రజత్ పటిదార్ ఎలాగూ ఆర్సీబీ తరపున మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు, అతడు కూడా వికెట్ కీపింగ్ చేస్తాడు. వికెట్ కీపర్ కోసమే వెళ్లాలంటే ఆక్షన్‌లోనూ బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కాదని రాహుల్‌ను తీసుకునే ప్రయత్నం చేస్తుందా? ఇప్పటికే ఈసాలా కప్ నమ్దే అంటూ కప్ కోసం ఆశగా చూస్తున్న ఆర్సీబీ..కేఎల్‌ను తీసుకుని రిస్క్ చేస్తుందా? అనేది డౌటే.
లక్..నో అంటే లోకల్ ఓకేనా
Categories:
Related Post
అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?
ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్‌లో రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. చెపాక్‌లో అశ్విన్, పంత్, గిల్ సెంచరీలు చేసి ఊపు
అంతా దబిడి దిబిడే ఐతే ఎట్లా..అంతా దబిడి దిబిడే ఐతే ఎట్లా..
న్యూజిలాండ్ ఇండియాపై ఇండియాలో 0-2తో టెస్ట్ సిరీస్ గెలిచింది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా? లేక 0-3తో వైట్ వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకుంటుందా? అనేది ఈ ఆదివారం (నవంబర్ 3, 2024)తో తేలిపోతుంది. వరుసగా 18 సిరీస్‌లు
చేదు మరిపించి..తీపితో మురిపిస్తారాచేదు మరిపించి..తీపితో మురిపిస్తారా
టీమిండియా స్వదేశంలో 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురై, వారం గడించిందో లేదో, అప్పుడే మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఆ టీమ్‌లోని ఒక్క అక్షర్ పటేల్ తప్ప మిగతా వారంతా టెస్ట్ జట్టులో లేనివారే. పక్కా టీ20 బ్యాటర్లు. ఇక మనం