విరాట్ కోహ్లీ…కింగ్ ఆఫ్ క్రికెట్ అనండి, చేజ్ మాస్టర్ అనండి, మీ ఇష్టం అద్బుతమైన ఆటగాడికి ఎన్నో పేర్లు పెట్టుకుంటారు ఫ్యాన్స్ ముద్దుగా…అక్కడిదాకా ఓకే. ఇండియా తరపున ఎన్నో రన్స్ స్కోర్ చేశాడు, ఎన్నో విజయాలు అందించాడు..మురిసిపోదాం, ప్రశంసిద్దాం..ఇదీ ఓకే. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున 17 సీజన్లుగా ఆడుతున్నాడు..ఎన్నో రన్స్ చేశాడు, కానీ కెప్టెన్‌గా ట్రోఫీ గెలిపించలేకపోయాడు.. ఐనా సరే ఈసాలా కప్ నమ్దే అనుకునే హార్డ్ కోర్ అభిమానులు విరాట్‌ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇది నిజంగా అద్భుతమైన విషయమే. ఆ వీరాభిమానులకు వీరతాళ్లేసుకుకోవాల్సిందే.
ఐతే బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ మొదలు…ఆర్సీబీ, ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ అభిమానులు చేసే హంగామా చూస్తే..ఒక పక్క జాలి, మరోపక్క చిరాకు అనిపించింది. అరే, అతను ఆడుతున్నది ఇండియాకురా…కోహ్లీ పేరు వచ్చిందే ఇండియాకు ఆడటం వల్ల..ముందు దేశం, ఆ తర్వాతే ఏదైనా…ఇదే విషయం మీరు వెళ్లి కోహ్లీనైనా అడగొచ్చు..దేశమే ముందు అనే సమాధానం వస్తుంది. అభిమానులూ హర్ట్ అయిపోకండి..ఆర్సీబీని మీరు ప్రేమిస్తే మేమూ చూసి ఆనందిస్తాం, విరాట్ కోహ్లీపై మీరు చూపించే అంతులేని ప్రేమను చూసి ఒక తెలుగువాళ్లుగా మీపై ఈర్ష్య కలుగుతోంది, మా సన్‌రైజర్స్ టీమ్‌కూ ఇలాంటి ఒక ఇండియా ప్లేయర్ దొరకడాయే అని..కానీ ఇండియా తరపున ఆడుతుంటే కూడా ఆర్సీబీ అని అరుస్తున్నారు కదా, అదే విసుగుపుట్టిస్తోంది. క్రికెట్‌ను అభిమానించే మీరంతా తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇండియాలో క్రికెట్ లేకపోతే, ఈ ఐపీఎల్ లేదు, ఏ ఫ్రాంచైజీ లేదు..
దేశానికి ఆడుతుంటే…ఫ్రాంచైజీ పైత్యమేమిటో
Categories: