Cricket Josh IPL స‌న్‌రైజ‌ర్స్‌కి ఇక నో చాన్స్

స‌న్‌రైజ‌ర్స్‌కి ఇక నో చాన్స్

స‌న్‌రైజ‌ర్స్‌కి ఇక నో చాన్స్ post thumbnail image

వ‌రుస‌గా 5 మ్యాచ్‌లు గెలిస్తేనే..ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశ‌మున్న ద‌శ‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైట‌న్స్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైట‌న్స్ 224 ర‌న్స్ చేయ‌గా..భారీ ల‌క్ష్య చేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చ‌తికిల‌ప‌డింది. ఓపెన‌ర్లు శుభారంభం అందించినా..గుజ‌రాత్ బౌల‌ర్లు చేసి మిడిల్ ఓవ‌ర్ల‌లో క‌ట్ట‌డి చేశారు. హెడ్ 20 ర‌న్స్ చేసి ఔట‌వ‌గా, అభిషేక్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ (74) చేసి దూకుడుగా ఆడే క్ర‌మంలో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత సాధించాల్సిన ర‌న్‌రేట్ భారీగా పెర‌గ‌డంతో స‌న్‌రైజ‌ర్స్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 10 మ్యాచుల్లో 7 ఓట‌ముల‌తో 9వ స్థానంలో కొన‌సాగుతోంది. ఇక మిగిలిన 4 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేర‌లేదు. ఎందుకంటే టాప్‌లో ఉన్న జ‌ట్ల మ‌ధ్య 6 జ‌ట్ల‌కు 16 పాయింట్లు సాధించే అవ‌కాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

క్లాసెన్ కాకా..కెవ్వు కేక‌క్లాసెన్ కాకా..కెవ్వు కేక‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ రిటెన్ష‌న్ లిస్ట్ అంద‌రూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖ‌ర్చు చేసిన ధ‌ర మాత్రం ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సెకండ్ బెస్ట్..అక్ష‌రాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొట్టినా, ఇప్పుడు అవే

ఈ కుర్రాణ్ని మీరు గ‌మ‌నించ‌ట్లే గానీ..ఈ కుర్రాణ్ని మీరు గ‌మ‌నించ‌ట్లే గానీ..

ఈ సీజ‌న్‌లో నికోల‌స్ పూర‌న్, విరాట్ కోహ్లీ, మిచెల్ మార్ష్‌…ఇలా మాంచి హిట్ట‌ర్ల గురించే మాట్లాడుకుంటున్నాం గానీ..వీళ్ల‌కు ఏ మాత్రం తీసిపోని మ‌రో ప్లేయ‌ర్ గురించి కాస్త త‌క్కువ‌గానే మాట్లాడుకుంటున్నాం. అత‌డే మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్, అసాధార‌ణ ప్ర‌తిభ ఉన్న బ్యాట‌ర్ సాయి

ఇర‌గ‌దీసి మ‌రీ..ఇంట గెలిచిందిఇర‌గ‌దీసి మ‌రీ..ఇంట గెలిచింది

హ‌మ్మ‌య్య‌.. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మొత్తానికి సొంత‌గ‌డ్డ‌పై మ్యాచ్ గెలిచింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 3 మ్యాచుల్లో 3 ఓడిపోగా..ఈసారి గెలుపుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌కు