సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ 38 బాల్స్‌లో 76 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. ఐతే థర్డ్ అంపైర్ ఇచ్చిన రనౌట్ నిర్ణయంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔటైన అనంతరం డగౌట్‌కు వెళ్తూ అక్కడున్న ఫోర్త్ అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..జీషన్ అన్సారీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతిని జాస్ బట్లర్ ఫైన్ లెగ్ వైపు తరలించి సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ క్రీజు చేరుకునే లోపే హర్షల్ పటేల్ వేసిన త్రో డైరెక్ట్‌గా వికెట్లను తాకింది. ఐతే థర్డ్ అంపైర్ రీప్లేలో ఆ బంతి వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్‌ను తాకి వికెట్ల పక్కనుంచి వెళ్లినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో క్లాసెన్ గ్లౌవ్ వికెట్లను తాకింది. రెండు మూడు యాంగిల్స్‌లో చూసిన తర్వాత థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. గిల్ ఉద్దేశంలో వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్ మాత్రమే వికెట్లను తాకిందని, బాల్ తాకలేదని వివరిస్తున్నాడు. ఐతే విశ్లేషకులు మాత్రం బాల్ సీమ్ వైపు వికెట్లను తాకిందని, అదే టైమ్‌లో క్లాసెన్ గ్లౌవ్ కూడా వికెట్లను తాకినట్టు చెబుతున్నారు.
రనౌట్‌పై గిల్ అసంతృప్తి

Related Post

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే

రివేంజ్‌తో కమ్ బ్యాక్ అవుతారా?రివేంజ్‌తో కమ్ బ్యాక్ అవుతారా?
గత సీజన్‌లో అద్భుతంగా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బదులు తీర్చుకునే టైమ్ వచ్చింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో తలపడబోతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కి
కర్ణ్‌శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అసలైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 పరుగుల టార్గెట్ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,