మొదటి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవలం ఒకటే గెలిచిన ముంబై ఇండియన్స్‌ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరు విశ్లేషకులైతే ఈ సీజన్‌లో చాన్సే లేదన్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ టీమ్‌కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలో..అందుకే వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు దూసుకెళ్లింది. ముంబై విజయాల్లో హిట్‌మ్యాన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, బుమ్రా, బౌల్డ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఐదుగురు మంచి ఫామ్‌లో ఉండటం ముంబైకి కలిసొస్తోంది. వీరితో పాటు రికెల్టన్, కర్ణ్‌శర్మ, దీపక్ చాహర్ కూడా టచ్‌లోకి రావడంతో ఈ టీమ్‌కి ఎదురేలేకుండా పోయింది. ఇదే తీరు కొనసాగిస్తే..ట్రోఫీల విషయంలో కూడా ముంబై సిక్సర్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబై సిక్సర్

Categories:
Related Post

బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్
వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు

బెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కిబెస్ట్ ముంబైకి..హైయెస్ట్ సన్‌రైజర్స్‌కి
కర్ణ్‌శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుతమైన బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అసలైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. 204 పరుగుల టార్గెట్ ఛేజింగ్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. అభిషేక్ పొరెల్,

ఆర్సీబీ పాంచ్ పటాకాఆర్సీబీ పాంచ్ పటాకా
సొంతగడ్డపై ఓడిపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ప్రత్యర్థి వేదికల్లో చెలరేగి ఆడుతోంది. తాజాగా ములన్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో చేజ్ చేసింది. కేవలం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్