Cricket Josh Matches ప‌దేళ్ల క్రేజీ కాంబో..రిపీట్‌

ప‌దేళ్ల క్రేజీ కాంబో..రిపీట్‌

ప‌దేళ్ల క్రేజీ కాంబో..రిపీట్‌ post thumbnail image

సూర్యుకుమార్ యాదవ్, గౌత‌మ్ గంభీర్..ఒక‌రేమో టీమిండియా టీ20ఐ కెప్టెన్..మ‌రొక‌రు టీమిండియా హెడ్ కోచ్..ఈ ఇద్ద‌రిదీ ఆట‌లో డిఫ‌రెంట్ స్టైల్. ఆటిట్యూడ్‌లోనూ డిఫ‌రెంట్ స్టైల్. ఐతే ఒక‌రి గురించి ఒక‌రికి బాగా తెలుసు. 2012, 2014లో కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్‌ ట్రోఫీ అందించిన గంభీర్‌..రీసెంట్‌గా 2024లో కేకేఆర్ కోచ్‌గానూ ఆ టీమ్‌కు ట్రోఫీ అందించాడు. ఇప్పుడు టీమిండియా కోచ్‌గా వ్య‌హ‌రిస్తున్నాడు. ఐతే 2014లో కేకేఆర్ విన్నింగ్ టీమ్‌లో మెంబ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్. గంభీర్ కెప్టెన్సీలో ఈ మిస్ట‌ర్ 360 డిగ్రీస్‌కు ఆడిన అనుభ‌వం ఉంది. ప్రాక్టీస్ సెష‌న్‌లో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే, సూర్య‌ను ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ముద్దుగా స్కై అని పిలుస్తుంటాం. ఐతే ఆ నిక్‌నేమ్ పెట్టింది గౌత‌మ్ గంభీరే. 2014లో ఎప్పుడైతే కేకేఆర్ టీమ్‌లో సూర్య చేరాడో అప్పుడే కెప్టెన్ గంభీర్ త‌న‌ను స్కై అని పిల‌వ‌డం మొద‌లెట్టాడ‌ని, మెల్ల‌గా అది అంద‌రికీ అల‌వాటైంద‌ని సూర్య రివీల్ చేశాడు.
ఇప్పుడు అదే బాండింగ్ టీమిండియా త‌ర‌పున కంటిన్యూ అవ‌బోతోంది. బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌కు సూర్య కెప్టెన్‌..గంభీర్ కోచ్..అంతేకాదు కేకేఆర్‌లో సూర్య‌తో క‌లిసి ఆడిన మోర్నే మోర్కెల్, ర్యాన్ టెన్ డొష్క‌టే కూడా ప్ర‌స్తుతం టీమిండియా స‌పోర్టింగ్ స్టాఫ్‌లో ఉన్నారు. దీంతో టీమ్‌లో ఒక ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం ఉండ‌బోతోంది. ఆఫ్ ద ఫీల్డ్ మైండ్ ఎంత రిఫ్రెష్‌గా ఉంటె, ఆన్ ద ఫీల్డ్ అంత మంచి రిజ‌ర్ట్స్ వ‌స్తాయి. గంభీర్‌, సూర్య కాంబో కోరుకునేది కూడా అదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

చేదు మ‌రిపించి..తీపితో మురిపిస్తారాచేదు మ‌రిపించి..తీపితో మురిపిస్తారా

టీమిండియా స్వ‌దేశంలో 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురై, వారం గ‌డించిందో లేదో, అప్పుడే మ‌రో సిరీస్‌కు సిద్ధ‌మైంది. ఆ టీమ్‌లోని ఒక్క అక్ష‌ర్ ప‌టేల్ త‌ప్ప మిగ‌తా వారంతా టెస్ట్ జ‌ట్టులో లేనివారే. ప‌క్కా టీ20 బ్యాట‌ర్లు. ఇక‌ మ‌నం

‘ఆస్ట్రేలియా’లోనే గంభీర్ ప్యూచ‌ర్‘ఆస్ట్రేలియా’లోనే గంభీర్ ప్యూచ‌ర్

టీమిండియా కోచ్ గౌత‌మ్ గంభీర్‌ను కొన‌సాగించాలా లేదా టెస్ట్ ఫార్మాట్ నుంచి త‌ప్పించి కేవ‌లం వ‌న్డే, టీ20ల‌కే కోచ్‌గా ఉంచాలా అనేది ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌బోయే బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీలో తేల‌నుంది. ఆసీస్ గ‌డ్డ‌పై న‌వంబ‌ర్ 22 నుంచి డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు

అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?అశ్విన్ కోటా మారిన‌ట్టేనా..?

టీమిండియా స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్…స్పిన్న‌ర్ అంటే అభిమానులు ఊరుకునేలా లేరు. ఎందుకంటే అశ్విన్‌ను ఇప్పుడు ఆల్‌రౌండ‌ర్ అనాల్సిందే. అత‌ని గ‌ణాంకాలు చూస్తూ విశ్లేష‌కులు సైతం ఒప్పుకోవాల్సిందే. 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 500ల‌కు పైగా వికెట్లు తీసి..3422 ర‌న్స్ చేశాడు.