హమ్మయ్య.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి సొంతగడ్డపై మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో 3 ఓడిపోగా..ఈసారి గెలుపుతో ఆ బ్యాడ్ సెంటిమెంట్‌కు స్వస్తి పలికింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ (70), దేవ్‌దత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ(20) దూకుడుగా ఆడి రెండొందలు దాటించారు. 206 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాయల్స్ ఆరంభం అదరగొట్టినా..మళ్లీ పాత కథే రిపీట్ చేసింది. 49 రన్స్‌తో జైస్వాల్ టాప్ స్కోరర్ గా ఉండగా, జురేల్ (47) ఊరించి ఉసూరుమనిపించాడు. ఆర్సీబీ బౌలర్ జాష్ హేజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్‌తో టీమ్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు.
ఇరగదీసి మరీ..ఇంట గెలిచింది

Related Post

నలుగురి ఆడిషన్ సౌతాఫ్రికాలో..నలుగురి ఆడిషన్ సౌతాఫ్రికాలో..
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో నలుగురు తప్ప మిగతా వాళ్లంతా ఏదో ఒక ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న వాళ్లే…ఐతే ఆ నలుగురు ఇప్పుడు సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో సత్తాచాటితే ఇటు ఇండియాకు మేలు, అటు వాళ్లకు ఆక్షన్‌లో మంచి

భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిసింది.పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ (81) తో దుమ్మురేపగా, విధ్వంస ప్రేమికుడు నికోలస్ పూరన్ కేకేఆర్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు.

ఈ సాలా కప్..బోణీ కొట్టారుఈ సాలా కప్..బోణీ కొట్టారు
ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించి సీజన్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి