చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే మ్యాచ్ ఇరుజట్లకు డూ ఆర్ డై లాంటిదే. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. 9వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ గెలిచి..ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తుండగా..పదో స్థానంలో ఉన్న సీఎస్కే సొంతగడ్డపై సత్తాచాటి తమ ఆశలు నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. రెండు జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే వరుసగా 6 మ్యాచ్‌లు గెలవాలి..అది ఈ మ్యాచ్‌తోనే మొదలెట్టాలని చూస్తున్నాయి ఇరుజట్లు. సీఎస్కే కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్. హోమ్ గ్రౌండ్‌లో మంచి రికార్డు ఉన్న ధోని..తన మైల్ స్టోన్ మ్యాచ్‌ను గెలుపుతో సెలబ్రేట్ చేస్తాడా? ఇక సన్‌రైజర్స్ ఇప్పటి వరకు చెపాక్‌లో సీఎస్కేను ఓడించిందే లేదు. ఆ చెత్త రికార్డును చెరిపేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆరాటపడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌కు డెవాల్డ్ బ్రెవిస్‌ను ఆడించే చాన్స్ ఉంది. ఇక సన్‌రైజర్స్ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకునే ఆలోచనలో ఉంది.
ఎవరి ఆశలు నిలబడతాయ్..?

Related Post

ఈ సాలా కప్..బోణీ కొట్టారుఈ సాలా కప్..బోణీ కొట్టారు
ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ఈసారైనా తమ లక్ పరీక్షించుకునేందుకు తొలి అడుగు గట్టిగానే వేసింది. ఏకంగా గత సీజన్ ఛాంపియన్ కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఓడించి సీజన్‌కు శుభారంభం చేసింది. ద కింగ్..విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి

SRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెలవాలిSRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెలవాలి
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయి తమ ప్రయాణాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 4 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్‌కు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే

మాజీ ఛాంపియన్లకు కష్టమేనా?మాజీ ఛాంపియన్లకు కష్టమేనా?
ఐపీఎల్ సీజన్ 18లో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడే టీమ్స్‌పై ఒక అంచనాకు రావడం సరైనది కాకపోయినప్పటికీ…ఆ టీమ్స్ ఆటతీరు గురించి చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్,