Cricket Josh IPL నువ్వేం చేశావో అర్థ‌మ‌వుతోందా..?

నువ్వేం చేశావో అర్థ‌మ‌వుతోందా..?

నువ్వేం చేశావో అర్థ‌మ‌వుతోందా..? post thumbnail image

ఇషాన్ కిష‌న్ .అతి పెద్ద పొర‌పాటు చేసి క్రికెట్ అభిమానుల‌తో పాటు విశ్లేష‌కుల ఆగ్రహానికి గుర‌వుతున్నాడు. అప్ప‌టికే స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్ప‌లు ప‌డుతోంది. ఆ ద‌శ‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఇషాన్ కిష‌న్, దీప‌క్ చ‌హార్ బౌలింగ్‌లో వైడ్‌ను ఎదుర్కొని, దాన్ని ఔట్‌గా భావించి డ‌గౌట్ వైపు వెళ్లిపోయాడు. నిజానికి అంపైర్ వైడ్‌గా ఇద్దామ‌నుకుంటున్న టైమ్‌లో ఇషాన్ కిష‌న్ వాక్ చేయ‌డంతో అంపైర్ కూడా ఔట్‌గా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఐతే రీప్లే చూసిన త‌ర్వాత ఆ బాల్ కిష‌న్ బ్యాట్‌కు త‌గ‌ల‌కుండా కీప‌ర్ చేతుల్లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. వైడ్ బాల్‌కు త‌న‌కు తాను ఔట్‌గా భావించి కిష‌న్ డ‌గౌట్ వైపు వెళ్లాడు. . పొర‌పాటు ప‌డ్డాడా..? అతిగా ఆలోచించాడా? ఏం అర్థం కాక అభిమానులు షాక్‌కు గుర‌య్యారు. కామెంటేట‌ర్లు, విశ్లేష‌కులు కిష‌న్ చేసిన ప‌నిని తెలివి త‌క్కువ ప‌నిగా అభివ‌ర్ణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ముంబై సిక్స‌ర్‌ముంబై సిక్స‌ర్‌

మొద‌టి 5 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడిపోయి కేవ‌లం ఒక‌టే గెలిచిన ముంబై ఇండియ‌న్స్‌ను చూసి..అభిమానులంతా తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. కొంద‌రు విశ్లేష‌కులైతే ఈ సీజ‌న్‌లో చాన్సే లేద‌న్నారు. కానీ ఐదుసార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ఈ టీమ్‌కు తెలుసు..ఎప్పుడు ఎలా బౌన్స్

అట్లుంట‌ది “ఇంపాక్ట్‌”అట్లుంట‌ది “ఇంపాక్ట్‌”

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న ఎప్పుడూ స్పెష‌లే, డిబేట‌బులే..ఆ డిస్క‌ష‌న్ గురించి కాదుగానీ, ఓ స‌ర‌దా స‌న్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. ల‌క్నో, గుజ‌రాత్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది. ల‌క్నో ఛేజింగ్ చేస్తున్న స‌మ‌యంలో..ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్

ఆర్సీబీ పాంచ్ ప‌టాకాఆర్సీబీ పాంచ్ ప‌టాకా

సొంత‌గ‌డ్డ‌పై ఓడిపోతున్న‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..ప్ర‌త్య‌ర్థి వేదిక‌ల్లో చెల‌రేగి ఆడుతోంది. తాజాగా ముల‌న్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో చేజ్ చేసింది. కేవ‌లం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్