కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య, సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఖండించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కోసం టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తమ టీమ్స్, యావత్ భారత్ మొత్తం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతోందని…వారి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులు 28 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా దీనిపై దేశమంతా రగిలిపోతోంది.ఇటువంటి సమయంలో ప్రజలంతా శాంతి కోరుకోవాలని, మానవత్వం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్‌లు ధరించి వారి సానుభూతి ప్రకటించుకున్నారు. నిమిషం పాటు మౌనం పాటించారు.
ఉగ్రదాడిని ఖండించిన ముంబై, సన్‌రైజర్స్

Related Post

చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చిందిచెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ
ఈ సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్

జైపూర్‌లోనూ లక్ లక్నోదేజైపూర్‌లోనూ లక్ లక్నోదే
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత విజయం సాధించింది. లక్నో విసిరిన 181 పరుగుల టార్గెట్‌ను చేదించే క్రమంలో చివరి బాల్ వరకు టెన్షన్ కొనసాగింది. ఒకదశలో రాయల్స్ ఈజీగా మరో ఓవర్ మిగిలి ఉండగానే