ఈ సీజన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి విజయాల సిక్సర్ కొట్టింది. 12 పాయింట్లతో టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు మిస్టర్ కన్సిస్టెంట్ సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్దిరిపోయే ఆరంభాన్నిచ్చారు. సుదర్శన్ 52 రన్స్ చేయగా, గిల్ 90 రన్స్ వద్ద ఔటై సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. బట్లర్ (41) కూడా విజృంభించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. 199 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో కేకేఆర్ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్ రహానే హాఫ్ సెంచరీ (50) చేసినా, మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, రషీద్‌ఖాన్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి.
GT..యూ బ్యూటీ

Related Post

ఆర్సీబీ పాంచ్ పటాకాఆర్సీబీ పాంచ్ పటాకా
సొంతగడ్డపై ఓడిపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..ప్రత్యర్థి వేదికల్లో చెలరేగి ఆడుతోంది. తాజాగా ములన్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో చేజ్ చేసింది. కేవలం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్

వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..వాన ఆగింది.. ఆర్సీబీదే బ్యాటింగ్..
మొత్తానికి కొన్ని గంటలుగా బెంగళూరులో కురుస్తున్న వర్షం ఆగిపోయింది. తొమ్మిదిన్నరకు టాస్ వేయగా..పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్‌లో వరుసగా మూడోసారి మొదట బ్యాటింగ్ చేయబోతోంది. రెండు సార్లు మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది.

కప్పు ముఖ్యం బిగిలు..కప్పు ముఖ్యం బిగిలు..
ఈ నలుగురు యంగ్ ఇండియా కెప్టెన్స్..తమ తమ టీమ్స్‌ను ఐపీఎల్‌లో బ్రహ్మాండంగా నడిపిస్తున్న తీరు చూస్తే..వీళ్లలో ఒకరు కప్పు కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ జెయింట్స్