ఆక్షన్‌లో దక్కిన భారీ ధర..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడా? మెంటల్లీ, టెక్నికల్లీ అంత ఫిట్‌గా అనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్, రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ వశమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 29 బంతుల్లో 60, ఆ తర్వాత లక్నోపై 45 రన్స్…మిగతావన్నీ సింగిల్ డిజిట్సే..కొన్నింట్లో బ్యాటింగ్ చాన్స్ రాలేదు. మరి గత సీజన్‌లో కేకేఆర్‌కు భారీ ధరతో ఆడిన మిచెల్ స్టార్క్ మిగతా మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. కీలకమైన ప్లే ఆఫ్స్, ఫైనల్లో మ్యాచ్ విన్నర్‌గా మారాడు. మరి వెంకటేశ్ అయ్యర్ ఏం చేస్తాడో చూడాలి.
అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్

Related Post

లో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లేలో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లే
రెండొందలు..రెండొందలకు పైగా రన్స్‌ను ఛేజ్ చేసిన సందర్భాలు చూశాం..యమా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న సన్‌రైజర్స్ పై 245 రన్స్ కాపాడుకోలేకపోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్‌పై 112 పరుగుల స్కోర్‌ను కాపాడుకుని ఇది అంతకుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది. 112 రన్స్

6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో

సన్‌రైజర్స్‌కు ఆ ముచ్చట తీరేనా?సన్‌రైజర్స్‌కు ఆ ముచ్చట తీరేనా?
చెన్నైకి ఎమ్ఎస్ ధోనిలాగా, ఆర్సీబీకి విరాట్ కోహ్లీలాగా, ముంబైకి రోహిత్‌శర్మలాగా, రాజస్థాన్‌కు సంజూ శాంసన్ లాగా, ఇలా ఇండియాకు ఆడిన, ఆడుతున్న సూపర్‌స్టార్ ప్లేయర్స్ ఎవరైనా ఒకరు సన్‌రైజర్స్‌కూ ఉంటే బాగుండని అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. కానీ సన్‌రైజర్స్ ఎక్కువగా ఫారిన్