Cricket Josh IPL ఆర్సీబీ పాంచ్ ప‌టాకా

ఆర్సీబీ పాంచ్ ప‌టాకా

ఆర్సీబీ పాంచ్ ప‌టాకా post thumbnail image

సొంత‌గ‌డ్డ‌పై ఓడిపోతున్న‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..ప్ర‌త్య‌ర్థి వేదిక‌ల్లో చెల‌రేగి ఆడుతోంది. తాజాగా ముల‌న్‌పూర్‌లో పంజాబ్‌పై గెలిచి ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. పంజాబ్ విసిరిన 158 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో చేజ్ చేసింది. కేవ‌లం 3 వికెట్లే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (61) హాఫ్ సెంచ‌రీ చేసి ఔట‌వ‌గా..విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 73 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్సీబీ మూడో స్థానానికి చేరుకుంది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 157 ర‌న్స్ చేసింది. ప్ర‌భ్‌సిమ్ర‌న్ 33 ర‌న్స్ చేయ‌గా..కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (6) సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇంగ్లిస్ 29 ర‌న్స్ చేశాడు. 114 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్సోయిన పంజాబ్‌ను శ‌శాంక్ సింగ్ (31 నాటౌట్‌), మార్కో య‌న్సెన్ (25 నాటౌట్) ఆదుకోవ‌డంతో ఆ మాత్రం స్కోరైనా వ‌చ్చింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో సుయాశ్ శ‌ర్మ‌, కృనాల్ పాండ్య‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జ‌రిగాయ‌ట‌. కేఎల్ రాహుల్ న‌మ్మ క‌న్న‌డిగ అంటూ ఇప్ప‌టికే సోష‌ల్

RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవ‌రెన్నివాడొచ్చు?

RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌లో కీ రోల్ ప్లే చేయ‌బోతున్నాయి. ఈ కార్డ్ గ‌తంలో కూడా ఉన్న‌ప్ప‌టికీ ఈసారి నిబంధ‌న మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే త‌మ ఆట‌గాడిని ఆక్ష‌న్‌లో తిరిగి ద‌క్కించుకోవాల‌నుకుంటుందో..ఆ ఆట‌గాడిని

ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్

బ్రిటీష్ సింగ‌ర్‌, టీవీ న‌టి జాస్మిన్ వాలియా ముంబై ఇండియ‌న్స్ టీమ్ బ‌స్సులో క‌నిపించ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య‌తో ఈ అమ్మ‌డు డేటింగ్‌లో ఉన్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికారు