చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది రివేంజ్ టైమ్..ఈ రెండు జట్ల మధ్య అంతకు ముందు చెన్నైలో మ్యాచ్ జరగగా..సీఎస్కే ముంబైని ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇలాఖా వాంఖడేలో మ్యాచ్ జరుగుతుంది. మరి హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని చెన్నైకి ఇచ్చిపడేయాలని ముంబై చూస్తోంది. ఐతే చెన్నై జట్టులో డెవాల్డ్ బ్రెవిస్ చేరాడు. గాయంతో టోర్నీకి దూరమైన గుర్‌జప్నీత్ సింగ్ స్థానంలో ఇతడిని రూ. 2.2 కోట్లకు తీసుకుంది. 2022, 2024 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన బ్రెవిస్..వాంఖడేలో ఈసారి ఎల్లో డ్రెస్‌లో కనిపించబోతున్నాడు. ఈ సీజన్‌లో తమ మాజీ ప్లేయర్సే ఆయా టీమ్‌ల ఓటమికి కారణమవుతున్నారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని బ్రెవిస్ వాంఖడేలో అదరగొట్టాలని సీఎస్కే ఆశపడుతోంది. మరి బ్రెవిస్‌ను ఆడిస్తారా..? బ్రెవిస్ ముంబై పాలిట విలన్‌లా మారతాడా…అనేది ఆసక్తిరేపుతోంది.
చెన్నై ప్లాన్ ప్రకారమే అతడిని తెచ్చింది

Related Post

కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్
కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు.

రంగంలోకి స్వప్నిల్..?రంగంలోకి స్వప్నిల్..?
గత సీజన్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేరడంలో తనదైన రోల్ పోషించిన స్వప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జరగబోయే మ్యాచ్‌లో స్వప్నిల్ ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుయాశ్‌శర్మ, కృనాల్‌పాండ్య ఉండగా

వేలంలో గాలం ఎవరికి?వేలంలో గాలం ఎవరికి?
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగనున్నదని సమాచారం. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఇండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ఐతే