ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవన్షి రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల 23 రోజులతో అతి పిన్న వయస్కుడిగా సూర్యవన్షి ఉండగా..అంతకు ముందు ప్రయాస్ రే బర్మన్ ఆర్సీబీ తరపున 16 ఏళ్ల 157 రోజులప్పుడు అరంగేట్రం చేశాడు. బీహార్‌కు చెందిన వైభవ్.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో లేకున్నా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అరంగేట్రం చేశాడు. అంతేకాదు..ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టి వావ్ అనిపించాడు. అదే ఊపు కొనసాగించి 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 రన్స్ చేసి ఔటయ్యాడు.
ఇక అతి చిన్న వయసులోనే ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో కోటీశ్వరుడైన రికార్డూ వైభవ్ సూర్యవన్షి పేరిటే ఉంది. మెగా ఆక్షన్‌లో ఢిల్లీతో పోటీపడి మరీ రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 1.10 కోట్ల ధరకు దక్కించుకుంది.
14 ఏళ్లకే అరంగేట్ర వైభవం..

Categories: