Cricket Josh IPL బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్

బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్

బ‌ట్ల‌ర్‌.. వాహ్ చేజ్ post thumbnail image

గుజ‌రాత్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..సెంచ‌రీ మిస్ చేసుకున్నా స‌రే, త‌న టీమ్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించాడు. అది కూడా 204 ప‌రుగుల టార్గెట్‌..అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య చేద‌న‌లో గుజ‌రాత్ త‌మ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (7) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ఇక మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్ సాయి సుద‌ర్శ‌న్ 36 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. 74 ర‌న్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన గుజ‌రాత్‌ను బ‌ట్ల‌ర్‌, రూథ‌ర్‌ఫోర్డ్ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 119 ర‌న్స్ పార్ట్‌న‌ర్‌షిప్ న‌మోదు చేశారు. రూథ‌ర్‌ఫోర్డ్ 34 బాల్స్‌లో 43 ర‌న్స్ చేసి ఔట‌వ‌గా..బ‌ట్ల‌ర్ 54 బాల్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 97 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో నిలిచాడు. గుజ‌రాత్ 18.5 ఓవ‌ర్ల‌లో టార్గెట్ చేజ్ చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది.
ఢిల్లీ బ్యాట‌ర్లు
ఇక‌ ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఏ ఒక్క‌రూ హాఫ్ సెంచ‌రీ చేయ‌క‌పోయినా, టాపార్డ‌ర్‌లో ఐదుగురు బ్యాట‌ర్లు త‌లా కొన్ని ర‌న్స్ జ‌త చేశారు. క‌రుణ్ 31, అక్ష‌ర్ 39, స్ట‌బ్స్ 31, అశుతోష్ 37, కేఎల్ రాహుల్ 28 ర‌న్స్ సాధించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్‌కు 4 వికెట్లు ద‌క్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

లెట‌ర్ ఉందా? చెక్ చేసిన‌ సూర్యలెట‌ర్ ఉందా? చెక్ చేసిన‌ సూర్య

ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఒక స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ కాలి మ‌డ‌మ కాస్త ట్విస్ట్ అవ‌డంతో..ఓవ‌ర్ మ‌ధ్య‌లో బ్రేక్ దొరికింది. అదే టైమ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, బ్యాట‌ర్ అభిషేక్‌శ‌ర్మ ద‌గ్గ‌రికి వెళ్లి అత‌డి

ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్ముంబై టీమ్ బ‌స్సులో బ్రిటీష్ సింగ‌ర్

బ్రిటీష్ సింగ‌ర్‌, టీవీ న‌టి జాస్మిన్ వాలియా ముంబై ఇండియ‌న్స్ టీమ్ బ‌స్సులో క‌నిపించ‌డం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య‌తో ఈ అమ్మ‌డు డేటింగ్‌లో ఉన్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా పుకార్లు షికారు

క్లాసెన్ కాకా..కెవ్వు కేక‌క్లాసెన్ కాకా..కెవ్వు కేక‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ రిటెన్ష‌న్ లిస్ట్ అంద‌రూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖ‌ర్చు చేసిన ధ‌ర మాత్రం ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సెకండ్ బెస్ట్..అక్ష‌రాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొట్టినా, ఇప్పుడు అవే