హోమ్ గ్రౌండ్.. ఫస్ట్ బ్యాటింగ్..ఇదేదో కలిసిరాని సెంటిమెంట్‌లా మారింది ఆర్సీబీకి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వర్షం కారణంగా కుదించిన 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 రన్స్ చేసింది. కానీ టిమ్ డేవిడ్ (26 బాల్స్‌లో 50, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దేవుడిలా కాపాడాడు ఆర్సీబీని. మరీ దారుణంగా ఆలౌట్ కాకుండా అడ్డుకుని..పోరాడగలిగే స్కోర్‌ను సాధించి పెట్టాడు. కెప్టెన్ రజత్ పటిదార్ (23) తప్ప మిగతా బ్యాటర్స్ సింగిల్ డిజిట్స్‌కే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఐతే ఆఖరి ఓవర్‌లోనే అసలైన మజా వచ్చింది. 14వ ఓవర్‌లో చివరి మూడు బాల్స్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి..ఆ తర్వాత నో బాల్‌కు 2 రన్స్ తీసి టిమ్ డేవిడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, యన్‌సెన్, చహాల్, బ్రార్ తలా 2 వికెట్లు తీశారు.
దేవుడ్‌లా ఆదుకున్నాడు..

Related Post

RTM కార్డ్స్ ఎవరెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవరెన్నివాడొచ్చు?
RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఈ కార్డ్ గతంలో కూడా ఉన్నప్పటికీ ఈసారి నిబంధన మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే తమ ఆటగాడిని ఆక్షన్‌లో తిరిగి దక్కించుకోవాలనుకుంటుందో..ఆ ఆటగాడిని

ఇటు కింగ్..అటు కేఎల్ కమింగ్..ఇటు కింగ్..అటు కేఎల్ కమింగ్..
లక్నో సూపర్ జెయింట్స్ వదులుకునేందుకు సిద్ధపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జరిగాయట. కేఎల్ రాహుల్ నమ్మ కన్నడిగ అంటూ ఇప్పటికే సోషల్

నితీశ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌నితీశ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్
బీసీసీఐ ప్రతి ఏడాది ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు దక్కింది. ఇక గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టు దక్కని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఈసారి మళ్లీ