మాజీ ప్రియుడే హతమార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ తరచుగా క్రైమ్ వార్తల్లో చూస్తాం. ఇక్కడ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆర్సీబీ విషయంలో గుజరాత్‌కు ఆడిన సిరాజ్, ఢిల్లీకి ఆడిన కేఎల్ రాహుల్..గతంలో ఆర్సీబీ ప్లేయర్సే..వాళ్లు ఈ సీజన్‌లో ఆర్సీబీపై సత్తా చాటి వారి ఓటమికి కారణమయ్యారు. ఇక తాజాగా యుజ్వేంద్ర చహాల్ కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఆర్సీబీ పాలిట విలన్‌గా మారాడు. 8 సీజన్లు ఆర్సీబీ తరపున ఆడిన చహాల్.. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఆడుతున్నాడు. ఆల్రెడి అంతకు ముందు కేకేఆర్‌పై ములన్‌పూర్‌లో 4 వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్న చహాల్‌కు..తన పాత గ్రౌండ్‌లో అడుగుపెట్టగానే మరింత జోష్ వచ్చింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. అప్పటికే 26 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్సీబీని చహాల్ కోలుకోలేని దెబ్బతీశాడు. ముందుగా జితేశ్‌ను ఔట్ చేసి..ఆ తర్వాత సెట్ అయిన బ్యాటర్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్‌ను ఔట్ చేసి తన మాజీ టీమ్‌ను నట్టేన ముంచాడు. 3 ఓవర్లు వేసి కేవలం 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
మాజీ ప్రియుడి ట్రెండ్

Related Post

గురితప్పని గుజరాత్గురితప్పని గుజరాత్
గుజరాత్…ఆవా దే (గుజరాతీ భాషలో తీసుకురండి)..వాళ్ల ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే మరో 2 పాయింట్లను తీసుకొచ్చింది. టైటన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్ వన్ సైడ్ చేసేసింది. మొదట బ్యాటింగ్ చేసి 20

ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వదిలేశాడుఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వదిలేశాడు
క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వదిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుందనేది మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఆ విషయం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదార్‌కు బాగా అర్థమై, అనుభవమై ఉంటుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో

రషీద్ వికెట్ తీశాడోచ్..రషీద్ వికెట్ తీశాడోచ్..
ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ రషీద్‌ఖాన్‌కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ