టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా రాహుల్, అతియా జంట తమ కుమార్తె పేరును రివీల్ చేశారు. తమ కూతురుకు ఇవారా అని పేరు పెట్టినట్టు తెలిపారు. ఇవారా అంటే సంస్కృత మూలాలున్న పదం..గాడ్స్ గిఫ్ట్ అనే అర్థం. రాహుల్, అతియా జోడి ఇన్స్టాలో ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని కేఎల్ రాహుల్ 2023లో పెళ్లి చేసుకోగా, 2025 మార్చి 25న అతియా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ టైమ్లో రాహుల్ అక్కడే ఉండటం వల్ల ఈ సీజన్ ఐపీఎల్ తొలి మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే.
బర్త్డే బాయ్ రాహుల్..కుమార్తె పేరు ప్రకటన

Categories: