సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 5వ ఓటమి. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసింది. పిచ్ స్లోగా ఉండటం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త కలిసొచ్చినప్పటికీ…సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. ముంబై బౌలర్లు పక్కా ప్లానింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. అభిషేక్ 40, క్లాసెన్ 37, హెడ్ 28 రన్స్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 పరుగుల టార్గెట్‌ను ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రోహిత్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ.. 26 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ కుదురుకున్నారు. ఈ ఇద్దరూ రన్‌రేట్ పెరగకుండా చూశారు. రికెల్టన్ 36, జాక్స్ 31 రన్స్ చేయడంతో ముంబై టార్గెట్ దిశగా పయనించింది. ఆ తర్వాత సూర్య 26 కాసేపు అలరించగా..తిలక్‌వర్మతో కలిసి కెప్టెన్ హార్దిక్ ముంబైకి విజయతీరాలకు చేర్చాడు. స్కోర్లు సమమైన తర్వాత ముంబై వికెట్ కోల్పోవడంతో గెలుపు కాస్త ఆలస్యమైందని చెప్పొచ్చు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 31 రన్స్ చేసిన విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
రైజర్స్ ఫాలింగ్..

Related Post

జాక్‌పాట్ ఖాయమే?జాక్‌పాట్ ఖాయమే?
గ్లెన్ ఫిలిప్స్..న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాడు. ఇతడు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండర్ కాదు..లోయర్ ఆర్డర్‌లో వచ్చి సిక్సర్లు బాదగలడు, స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు తీయగలడు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లు పట్టగలడు, వికెట్ కీపింగ్ కూడా

6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య..ఇప్పుడు సెంచరీ6 బంతుల్లో 6 సిక్స్‌ల ఆర్య..ఇప్పుడు సెంచరీ
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య..సెంచరీతో దుమ్మురేపాడు. ఇవాళ ఇతడే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతకీ ఎవరీ ఆర్య? ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండర్-19లోనూ తనదైన మార్క్ చూపించాడు. 2021లో దేశవాళీ టీ20లో

ఎవరీ హిమ్మత్ సింగ్..?ఎవరీ హిమ్మత్ సింగ్..?
గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్‌ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ