Cricket Josh IPL ఔటై మ‌ళ్లీ వ‌చ్చాడు..ఐనా

ఔటై మ‌ళ్లీ వ‌చ్చాడు..ఐనా

ఔటై మ‌ళ్లీ వ‌చ్చాడు..ఐనా post thumbnail image

ముంబై ఇండియ‌న్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. ముంబై బ్యాట‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌..స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ జీష‌న్ హ‌న్సారీ బౌలింగ్ షాట్‌కు ప్ర‌య‌త్నించి షార్ట్ క‌వ‌ర్‌లో ఉన్న ప్యాట్ క‌మిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. పెవిలియ‌న్ వైపు వెళ్లిపోయాడు కూడా..కానీ అంత‌లోనే ఊహించ‌ని ప‌రిణామం, మ్యాచ్ అఫీషియ‌ల్స్ రికెల్ట‌న్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ల‌నివ్వ‌లేదు. ఎందుకంటే థ‌ర్డ్ అంపైర్ అది ఔటా, కాదా అని చెక్ చెస్తుండ‌డ‌మే. రికెల్ట‌న్ షాట్ ఆడిన స‌మ‌యంలో వికెట్ కీప‌ర్ క్లాసెన్ త‌న గ్ల‌వ్స్‌ను వికెట్ల ముందుకు తెచ్చాడు. రీప్లేలో అది క‌న్ఫ‌ర్మ్ అవ‌డంతో థ‌ర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించి రికెల్ట‌న్‌ను మ‌ళ్లీ గ్రౌండ్‌లోకి ర‌ప్పించారు. ఐతే రికెల్ట‌న్ మ‌రో రెండు బౌండ‌రీలు సాధించి ఔట‌య్యాడు. త‌న‌కు క‌లిసొచ్చిన ల‌క్‌ను ఎక్కువ‌సేపు ఉప‌యోగించుకోలేక‌పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించిన‌ట్టుగానే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్క‌లుంటాయి అవి ఇప్పుడు

రైజర్స్ ఫాలింగ్‌..రైజర్స్ ఫాలింగ్‌..

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో 5వ ఓట‌మి. ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ఓట‌మి చ‌విచూసింది. పిచ్ స్లోగా ఉండ‌టం, హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి కాస్త క‌లిసొచ్చిన‌ప్ప‌టికీ…స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మైంది. ముంబై బౌల‌ర్లు ప‌క్కా ప్లానింగ్‌తో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌ను

నాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTMనాలుగు మ్యాచ్‌లు.. డెబ్యూలోనే POTM

ఐపీఎల్ 2025 అంచనాలకు తగ్గట్లుగానే అదరగొడుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లలో అటు కుర్రాళ్లు.. ఇటు స్టార్ ఆటగాళ్లు రాణించడం గమనించాల్సిన విషయం. ఇంకో విషయం