రెండొందలు..రెండొందలకు పైగా రన్స్‌ను ఛేజ్ చేసిన సందర్భాలు చూశాం..యమా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న సన్‌రైజర్స్ పై 245 రన్స్ కాపాడుకోలేకపోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్‌పై 112 పరుగుల స్కోర్‌ను కాపాడుకుని ఇది అంతకుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది. 112 రన్స్ ఛేజింగ్‌లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 15.3 ఓవర్లలోనే 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ చిన్న టోటల్‌ను కోల్‌కత ఊదేస్తుందని అంతా అనుకున్నారు. కానీ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు ఉన్న దశ నుంచి కోల్‌కత కుప్పకూలడం వైపుగా పయనించింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి గెలుపుపై నమ్మకం పెంచుకున్నారు. ముఖ్యంగా యుజ్వేంద్ర చహాల్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బతీశాడు. ఐతే ఆండ్రె రసెల్ కాసేపు బౌండరీలతో భయపెట్టినా, మరో ఎండ్‌లో ఉన్న వైభవ్ అరోరా వికెట్ తీసి అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ గెలుపును ఒక వికెట్ దూరంలో నిలిపాడు. ఆ తర్వాతి ఓవర్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న రసెల్..మార్కో యాన్సెన్ వేసిన బాల్‌ను భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 95 పరుగులకే ముగిసింది. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చహాల్‌కు 4 వికెట్లు, మార్కో యాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి.
లో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లే

Categories:
Related Post

మాజీ ప్రియుడి ట్రెండ్మాజీ ప్రియుడి ట్రెండ్
మాజీ ప్రియుడే హతమార్చాడు…ఇలాంటి హెడ్డింగ్స్ తరచుగా క్రైమ్ వార్తల్లో చూస్తాం. ఇక్కడ ఆ హెడ్డింగ్ అంత ఆప్ట్ కాదు కానీ దీన్ని కొంచెం స్మూత్ గా..ఐపీఎల్ స్టైల్లో చెప్పాలంటే మాజీ ప్రియుడే ఓడించాడు అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో అదే ట్రెండ్

రంగంలోకి స్వప్నిల్..?రంగంలోకి స్వప్నిల్..?
గత సీజన్‌లో ఆర్సీబీ బౌన్స్ బ్యాక్ అయి..ప్లే ఆఫ్స్‌కు చేరడంలో తనదైన రోల్ పోషించిన స్వప్నిల్ సింగ్..ఈసారి కూడా చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో సీఎస్కేతో జరగబోయే మ్యాచ్‌లో స్వప్నిల్ ఆడే అవకాశాలున్నాయి. ఇప్పటికే సుయాశ్‌శర్మ, కృనాల్‌పాండ్య ఉండగా

ముంబై టీమ్ బస్సులో బ్రిటీష్ సింగర్ముంబై టీమ్ బస్సులో బ్రిటీష్ సింగర్
బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ టీమ్ బస్సులో కనిపించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో ఈ అమ్మడు డేటింగ్‌లో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు