Cricket Josh IPL జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్ద‌దే?

జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్ద‌దే?

జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్ద‌దే? post thumbnail image

ఐపీఎల్‌లో గాయాల కార‌ణంగా లీగ్ నుంచి నిష్క్ర‌మిస్తున్న ఆట‌గాళ్ల జాబితా రోజ‌రోజుకూ పెరుగుతోంది. తాజాగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్, లెగ్ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జాంప టోర్నీకి దూర‌మ‌య్యాడు. భుజం గాయం తిర‌గ‌బెట్ట‌డంతో అత‌డు లీగ్‌కు దూర‌మ‌వ్వ‌నున్న‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ మేనేజ్మెంట్ తెలిపింది. 2023 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందే ఆడ‌మ్ జాంప భుజం నొప్పితో బాధ‌ప‌డుతూ కొన్నాళ్లు చికిత్స పొందాడు. త్వ‌ర‌గానే రిక‌వ‌ర్ అయి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాడు. ఐతే ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాకు వెళుతున్న జాంప కొన్నాళ్ల త‌ర్వాత తిరిగొచ్చే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఐతే అత‌డికి రీప్లేస్‌మెంట్‌గా క‌ర్నాట‌క బ్యాట‌ర్ స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్‌ను జ‌ట్టులోకి తీసుకుంది స‌న్‌రైజ‌ర్స్. ఇక ఇలా గాయాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు టోర్నీకి ఎవ‌రెవ‌రు దూర‌మ‌య్యారంటే..
1. రుతురాజ్ గైక్వాడ్- చెన్నై సూప‌ర్ కింగ్స్
2. లాకీ ఫెర్గుస‌న్- పంజాబ్ కింగ్స్
3. మొహిసిన్‌ ఖాన్ – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
4. హ్యారీ బ్రూక్- ఢిల్లీ క్యాపిట‌ల్స్
5. ఉమ్రాన్ మాలిక్‌- కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్
6. ఆడ‌మ్ జాంప‌- స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
7. గ్లెన్ ఫిలిప్స్- గుజ‌రాత్ టైట‌న్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో దాదాపు చాలా టీమ్స్‌కు వారి మాజీ ప్లేయ‌ర్స్ కొర‌క‌రాని కొయ్య‌లా త‌యార‌వుతున్నారు. ఇంకా చెప్పాలంటే మాజీ ప్లేయ‌ర్లే ఓట‌మిని శాసిస్తున్నారు. రివేంజ్ తీర్చుకుంటున్నారా? క‌సితో ఆడుతున్నారో తెలియ‌దుగానీ, మాజీ టీమ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ

ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..ఇటు కింగ్‌..అటు కేఎల్ క‌మింగ్..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డిన కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ జ‌ట్టులోకి తీసుకునేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన టాక్స్ కూడా జ‌రిగాయ‌ట‌. కేఎల్ రాహుల్ న‌మ్మ క‌న్న‌డిగ అంటూ ఇప్ప‌టికే సోష‌ల్

కిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లేకిష‌న్‌కు బాల్ క‌నిపించ‌లే

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేయ‌ర్ ఇషాన్ కిష‌న్ అద్బ‌తమైన ఫీల్డింగ్‌తో బౌండ‌రీని సేవ్ చేశాడు, కానీ బాల్‌ను ఆపిన త‌ర్వాత ఆ బాల్ ఎక్క‌డుందో క‌నిపించ‌క వెతుక్కుంటూ ఉన్నాడు. అంతలో కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ వ‌చ్చి ఆ బాల్‌ను తీసి బౌల‌ర్‌కు విసిరాడు.