కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు. ఇక అదే ఓవర్‌లో కెప్టెన్ శ్రేయస్‌ను కూడా ఔట్ చేసి డబుల్ ఇంపాక్ట్ చూపించాడు హర్షిత్ రాణా. ఆ మరుసటి ఓవర్‌లోనే జాష్ ఇంగ్లిస్‌ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. ఇక పవర్ ప్లే ఆఖరి బంతికి ఊపుమీదున్న ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ను కూడా హర్షిత్ ఔట్ చేసి పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో పంజాబ్ 54 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వధేరా, యాన్సెన్ కొన్ని రన్స్ జోడించినప్పటికీ వికెట్ల పతనం ఆగకపోవడంతో పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు తీశారు.
కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్

Related Post

వేదిక ఫిక్స్, డేట్స్ ఫిక్స్.. జెడ్డాలోవేదిక ఫిక్స్, డేట్స్ ఫిక్స్.. జెడ్డాలో
ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని, వేదికను కూడా ఖరారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేయగా, ఇప్పుడు జెడ్డాకు

అశుతోప్ శర్మ..ఢిల్లీ హీరోఅశుతోప్ శర్మ..ఢిల్లీ హీరో
అశుతోష్ శర్మ..నువ్వు తోపు శర్మ..గత సీజన్‌లో పంజాబ్ తరపున ఆడి ఇరగదీస్తే అదుర్స్ అనుకున్నాం..కానీ అది జస్ట్ ట్రైలరే.. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేస్తూ..వన్ మ్యాన్ షో చేసి తమ టీమ్‌ను గెలిపించాడు. లిటరల్‌గా చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..
చెన్నై సూపర్ కింగ్స్, దాదాపుగా తమ ప్లేయింగ్ లెవన్‌ను మార్చదు. టీమ్ నిండా సీనియర్ ప్లేయర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజన్‌లో మిగతా ఫ్రాంచైజీలు కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్, విఘ్నేశ్,