Cricket Josh IPL మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?

మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా?

మళ్లీ మాజీ ప్రియుడే ఓడిస్తాడా? post thumbnail image

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో దాదాపు చాలా టీమ్స్‌కు వారి మాజీ ప్లేయ‌ర్స్ కొర‌క‌రాని కొయ్య‌లా త‌యార‌వుతున్నారు. ఇంకా చెప్పాలంటే మాజీ ప్లేయ‌ర్లే ఓట‌మిని శాసిస్తున్నారు. రివేంజ్ తీర్చుకుంటున్నారా? క‌సితో ఆడుతున్నారో తెలియ‌దుగానీ, మాజీ టీమ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ చూశాం, గుజ‌రాత్‌కు ఆడుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, త‌న మాజీ టీమ్ స‌న్‌రైజ‌ర్స్‌పై ఎలా రెచ్చిపోయి ఆడాడో..ఇక ల‌క్నోకు ఆడుతున్న పూర‌న్ ఒక‌ప్పుడు స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌రే..ఇత‌గాడు హైద‌రాబాద్ టీమ్ ఓట‌మిని ఎలా శాసించాడో చూశాం. గుజ‌రాత్‌కు ఆడుతున్న‌ మ‌హ్మ‌ద్ సిరాజ్, త‌న పాత‌టీమ్ ఆర్సీబీపై చెల‌రేగిపోవ‌డ‌మూ చూశాం.కానీ ఇప్పుడు మాట్లాడుకోబోయే ప్లేయ‌ర్ వీళ్లంద‌రికంటే మించిన క‌సితో ర‌గులుతున్న‌వాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్..గ‌త సీజ‌న్‌లో కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపిన నాయ‌కుడు. త‌మ టీమ్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపిన కెప్టెన్‌ను వ‌దులుకోవ‌డం ఏ ఫ్రాంచైజీ చేయ‌దు. కానీ అది శ్రేయ‌స్ అయ్య‌ర్ విష‌యంలో జ‌రిగింది. ఇంకా చెప్పాలంటే శ్రేయ‌స్ అయ్య‌రే కేకేఆర్‌ను వ‌ద్ద‌నుకున్నాడ‌నే వార్త‌లే ప్ర‌చార‌మ‌య్యాయి. త‌ను కేకేఆర్‌కు క‌ప్పు గెలిపించిన‌ప్ప‌టికీ, ఆ క్రెడిట్ మొత్తం కోచ్ గౌత‌మ్ గంభీర్‌కే క‌ట్ట‌బెట్టార‌ని, త‌న‌కు ద‌క్కాల్సిన విలువ‌, గౌర‌వం ద‌క్క‌లేద‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్ కావాల‌నే ఆ జ‌ట్టును వ‌దిలేశాడ‌నేది టాక్. నిజ‌మే, ఆట‌గాడికి ఆ మ‌త్రం ఆత్మ‌గౌర‌వం ఉండాల్సిందే..ల‌క్నో ఓన‌ర్ సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ ఉదంత‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. కేకేఆర్ టీమ్‌పై ర‌గిలిపోతున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పుడు అదే టీమ్‌తో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్‌ ముల‌న్‌పూర్‌లో జ‌ర‌గ‌బోతోంది. గ‌త మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ చేతిలో ఓట‌మి చ‌విచూసిన పంజాబ్‌ను సొంత‌గ‌డ్డ‌పై గెలిపించాల‌ని, అది కూడా త‌న‌ను అవ‌మానించిన కేకేఆర్‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని చూస్తున్నాడు శ్రేయ‌స్ అయ్య‌ర్. మ‌రి ట్రెండ్ ప్ర‌కారం శ్రేయ‌స్ అయ్య‌ర్ పంతం నెర‌వేరుతుందా? చెన్నైని చెన్నైలో ఓడించి ఊపుమీదున్న కేకేఆర్ పంజాబ్‌కూ షాక్ ఇస్తుందా? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ కాంటెస్టే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌ఆ ఐదుగురితో జాగ్ర‌త్త‌

కోల్‌త నైట్‌రైడ‌ర్స్‌లోని కీల‌క ఆట‌గాళ్ల‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ లుక్కేయాల్సిందే. ఇరుజ‌ట్లు 3 మ్యాచులు ఆడి రెండింట్లో ఓడిపోయాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఎస్ ఆర్ హెచ్ 8వ స్థానంలో, కేకేఆర్ ప‌దో స్థానంలో ఉన్నాయి. గ‌త సీజ‌న్ ఫైన‌లిస్ట్‌లు ముంద‌డుగు వేయాలంటే

GT..యూ బ్యూటీGT..యూ బ్యూటీ

ఈ సీజ‌న్ ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైట‌న్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించి విజ‌యాల సిక్స‌ర్ కొట్టింది. 12 పాయింట్ల‌తో టేబుల్‌లో టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతోంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్‌కు మిస్ట‌ర్ క‌న్సిస్టెంట్ సాయి సుద‌ర్శ‌న్, కెప్టెన్

ధోని..ద ఫినిష‌ర్..అంతేధోని..ద ఫినిష‌ర్..అంతే

చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థ‌లా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన త‌రుణం రానే వ‌చ్చింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ద ఫినిష‌ర్ అనే ట్యాగ్ లైన్‌ను మ‌ళ్లీ గుర్తు