మొన్ననే మనం అనుకున్నాం..చెన్నై సూపర్ కింగ్స్ గుంటూరు కుర్రాడు షేక్ రషీద్‌ను ఆడిస్తే బాగుంటుందని…ఆ మ్యాచ్‌లో అవకాశం రాలేదు గానీ, లక్నో సూపర్ జెయింట్స్‌పై లక్ కలిసొచ్చింది..నిజమే ఎందుకంటే రుతురాజ్ గాయం కారణంగా లీగ్‌కు దూరమవడం..ఓపెనర్‌గా డెవాన్ కాన్వే విఫలమవుతుండటం…దీంతో బెంచ్‌పై ఉన్న ఆప్షన్స్‌ను పరీక్షించాలనుకుంది సీఎస్కే. ఇంకేముంది రషీద్‌కు చాన్స్ దక్కింది. ఇప్పటి వరకు దేశవాళీ టీ20ల్లో ఓపెనింగ్‌లో ఆడని రషీద్‌ను జట్టులో తీసుకోవడమే కాదు..ఏకంగా ఓపెనర్‌గా పంపించింది సీఎస్కే. ఐతే ఈ తెలుగు కుర్రాడు ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడాడు. పక్కా క్రికెటింగ్ షాట్స్‌తో ఫోర్లు కొట్టి అలరించాడు. సహజ సిద్ధ క్రికెట్‌కు భిన్నంగా చిత్రవిచిత్రమైన షాట్లతో రెచ్చిపోయే ఈ ఫార్మాట్‌లో ఆడిన కాసేపైనా క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించాడు రషీద్. తొలి మ్యాచ్‌లోనే క్వాలిటీ ప్లేయర్‌లాగా కనిపించాడు. 19 బాల్స్‌లో 26 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. రషీద్‌కు సీఎస్కే మరిన్ని అవకాశాలివ్వాలని ఆశిద్దాం
గుంటూరు కుర్రాడి అరంగేట్రం అదుర్స్

Related Post

బట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్‌కేబట్లర్ వేలంలోకి వస్తే..ఆ టీమ్‌కే
రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జాస్ బట్లర్..ఆ ఫ్రాంచైజీని వదిలి ఆక్షన్‌లోకి రావాలనుకుంటున్నాడట. ఒకవేళ అదే జరిగితే ఈసారి జరగబోయే మెగా ఆక్షన్‌లో ఇతడికి జాక్‌పాట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్నర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా

జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్దదే?జాంప ఔట్.. ఇంకా లిస్ట్ పెద్దదే?
ఐపీఎల్‌లో గాయాల కారణంగా లీగ్ నుంచి నిష్క్రమిస్తున్న ఆటగాళ్ల జాబితా రోజరోజుకూ పెరుగుతోంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంప టోర్నీకి దూరమయ్యాడు. భుజం గాయం తిరగబెట్టడంతో అతడు లీగ్‌కు దూరమవ్వనున్నట్టు సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ తెలిపింది. 2023

కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?కుర్రాళ్లు.. గుర్తుపెట్టుకోవాలా మీ పేర్లు.?
ఈ సీజన్ ఐపీఎల్‌లో కొత్త కుర్రాళ్ల హవా కొనసాగుతోంది. అరంగేట్రంలోనే అదరగొడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వీళ్లలో ముఖ్యంగా దిగ్వేశ్ రాఠీ , విఘ్నేష్ పుతుర్, జీషన్ అన్సారి, అశ్వనీ కుమార్ ఉన్నారు. దిగ్వేశ్ రాఠీ, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఢిల్లీ