చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్‌ను మళ్లీ గుర్తు చేశాడు. 167 పరుగుల టార్గెట్‌ను చెన్నై ఛేదించే క్రమంలో మ్యాచ్ ఒకదశలో లక్నోవైపు ఉందన్నట్టు అనిపించింది. ఒక ఎండ్‌లో శివమ్ దూబె తన సహజ శైలికి విరుద్ధంగా మెల్లగా ఆడుతున్నాడు. అదే టైమ్‌లో ధోని ఎంటరయ్యాడు. అప్పుడు గెలుపు ఈక్వేషన్ 30 బాల్స్‌లో 56 రన్స్ కావాలి. ధోని తొలి బాల్‌కి సింగిల్ తీసి..ఆ తర్వాత బాల్ నుంచి బౌండరీల కౌంట్ మొదలెట్టాడు. చివరి 12 బాల్స్‌లో 24 రన్స్‌కు ఈక్వేషన్ మారింది. దూబె 4, 6 కొట్టగా…అదే ఓవర్‌ను ధోని ఫోర్‌తో ముగించాడు. ఇక ఆరు బాల్స్‌లో 5 రన్స్ అవసరమయ్యాయి. గెలుపు సీఎస్కేకు సునాయసంగా చిక్కింది. ధోని 11 బాల్స్‌లో 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక శివమ్ దూబె 37 బాల్స్‌లో 43 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. ఇతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
ధోని..ద ఫినిషర్..అంతే

Related Post

RTM కార్డ్స్ ఎవరెన్నివాడొచ్చు?RTM కార్డ్స్ ఎవరెన్నివాడొచ్చు?
RTM (రైట్ టు మ్యాచ్) కార్డ్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఈ కార్డ్ గతంలో కూడా ఉన్నప్పటికీ ఈసారి నిబంధన మారింది. ఏ ఫ్రాంచైజీ ఐతే తమ ఆటగాడిని ఆక్షన్‌లో తిరిగి దక్కించుకోవాలనుకుంటుందో..ఆ ఆటగాడిని

రషీద్ వికెట్ తీశాడోచ్..రషీద్ వికెట్ తీశాడోచ్..
ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ రషీద్‌ఖాన్‌కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ

బట్లర్ రెడీ..రాయల్స్ బీ కేర్ ఫుల్బట్లర్ రెడీ..రాయల్స్ బీ కేర్ ఫుల్
మాజీ టీమ్‌లపై ప్లేయర్స్ పగబట్టినట్టుగా పెర్ఫార్మ్ చేయడం ఐపీఎల్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ లక్నో తరపున ఆడుతూ..తమ మాజీ టీమ్ సన్‌రైజర్స్‌పై ఇరగదీశారు. మొన్నటికి మొన్న గుజరాత్‌కు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ తన మాజీ టీమ్