Cricket Josh IPL మూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదు

మూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదు

మూడొంద‌ల వీరుడు..చాన్స్ వ‌ద‌ల్లేదు post thumbnail image

క‌రుణ్ నాయ‌ర్‌, ఈ పేరు గుర్తుంది క‌దా..హార్డ్‌కోర్ టీమిండియా ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుర్తుండిపోయే పోరు. ఎందుకంటే 2016లో టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచ‌రీ సాధించి ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్‌గా, ఓవ‌రాల్ క్రికెట్‌లో మూడో బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో క‌నుమ‌రుగ‌య్యాడు. ఐపీఎల్‌లోనూ అంతంత మాత్రంగానే మెరిశాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆడటం ఇది మూడో సీజ‌న్‌. గ‌తంలో 2016,17లో ఢిల్లీకి ఆడిన క‌రుణ్ ఈ సీజ‌న్‌కు ముందు జ‌రిగిన మెగా ఆక్ష‌న్‌లో బేస్ ప్రైస్ రూ. 50 ల‌క్ష‌ల‌కే ఢిల్లీ వ‌శ‌మ‌య్యాడు.
ఐతే ఈ సీజ‌న్‌లో ఢిల్లీ 5 మ్యాచ్‌లు ఆడిన‌ త‌ర్వాత ఆరో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా క‌రుణ్ నాయ‌ర్‌కు అవ‌కాశం ఇచ్చింది. చాన్స్ వ‌స్తే ఎలా ఉప‌యోగించుకోవాలో త‌న‌ను చూసి నేర్చుకోవాలంటే ఎంతో మందికి ఇన్స్‌ప్రేష‌న్ ఇచ్చే ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా జ‌స్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అత‌డు కొట్టిన బౌండ‌రీలు క్రికెట్ విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. 40 బాల్స్‌లో 89 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. క‌రుణ్ ఇంకొంచెం సేపు క్రీజులో ఉంటే ఢిల్లీని గెలిపించేవాడే..కానీ దుర‌దృష్ట‌వశాత్తు అత‌డు ఔట‌వ‌డం..ఢిల్లీ ఓట‌మిపాల‌వ‌డం అలా జ‌రిగిపోయాయి. కానీ క‌రుణ్‌లో ఇంకా ప‌రుగుల క‌సి త‌గ్గ‌లేదనేది మాత్రం అభిమానుల‌కు, టీమ్ మేనేజ్మెంట్‌కు అర్థ‌మైంది. మ‌రి క‌రుణ్‌కు ఢిల్లీ ఇంకిన్ని అవ‌కాశాలు ఇస్తుందా అనేది ఆస‌క్తిక‌ర విష‌యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

నువ్వేం చేశావో అర్థ‌మ‌వుతోందా..?నువ్వేం చేశావో అర్థ‌మ‌వుతోందా..?

ఇషాన్ కిష‌న్ .అతి పెద్ద పొర‌పాటు చేసి క్రికెట్ అభిమానుల‌తో పాటు విశ్లేష‌కుల ఆగ్రహానికి గుర‌వుతున్నాడు. అప్ప‌టికే స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయి..తిప్ప‌లు ప‌డుతోంది. ఆ ద‌శ‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఇషాన్ కిష‌న్, దీప‌క్ చ‌హార్ బౌలింగ్‌లో

RCBకే ఎక్కువ చాన్స్RCBకే ఎక్కువ చాన్స్

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ సొంత‌గ‌డ్డ‌పై మూడో మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌బోతోంది.  ఇప్ప‌టికే హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడిన ఆర్సీబీ ఈసారి ఆ ట్రెండ్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. మ‌రోవైపు పంజాబ్ 111 ర‌న్స్‌ను కూడా డిఫెండ్ చేసుకుని

నాయ‌కుడొచ్చాడు..రికార్డులు లెక్క‌బెట్టండినాయ‌కుడొచ్చాడు..రికార్డులు లెక్క‌బెట్టండి

మ‌హేంద్రసింగ్ ధోని..మ‌ళ్లీ చెన్నై సూప‌ర్ కింగ్స్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో క్రికెట్ ప్ర‌పంచంలో మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ప్ర‌స్తుతం వ‌రుస ఓట‌ముల‌తో ఉన్న సీఎస్కేని విజిల్ వేసి మేల్కొలుపుతాడా? అనేది ఆస‌క్తిరేపుతోంది. ఎందుకంటే ధోని కెప్టెన్‌గా ఏదైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు.