బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించి ఊపుమీదుంది. ఇక రెండో టెస్ట్ కాన్పూర్‌లో సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్‌లో ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా…రెండో టెస్ట్‌లో స్ట్రాటజీ మార్చే చాన్స్ ఉంది. కాన్పూర్‌లోని బ్లాక్ సాయిల్ (నల్లమట్టి పిచ్) స్లోగా ఉండే చాన్స్ ఉంది. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. బుమ్రాకు రెస్ట్ ఇచ్చి..సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను కొనసాగిస్తే..బుమ్రా స్థానంలో లోకల్ బాయ్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించొచ్చు. ఒకవేళ ఆకాశ్‌దీప్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్ ను ఆడించే అవకాశాలూ లేకపోలేదు. మొత్తానికి కాన్పూర్ టెస్ట్‌లో ఆడేందుకు లోకల్ బాయ్స్ కుల్దీప్, యష్ దయాల్ సిద్ధంగా ఉన్నారు.

kuldeep yadav hope to play kanpur test