ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎప్పుడూ స్పెషలే, డిబేటబులే..ఆ డిస్కషన్ గురించి కాదుగానీ, ఓ సరదా సన్నివేశం గురించి మాట్లాడుకోవాలిప్పుడు. లక్నో, గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. లక్నో ఛేజింగ్ చేస్తున్న సమయంలో..ఇన్నింగ్స్ 13వ ఓవర్ తర్వాత స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ ఉంది. ఐతే అంపైర్ అనుకోకుండా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేటపుడు ఏదైతే సిగ్నల్ ఇస్తాడో..స్ట్రాటెజిక్ టైమ్ ఔట్‌కి అదే సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే తన పొరపాటును గమనించి చిరునవ్వుతో మళ్లీ స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ సిగ్నల్‌ను సరిగా ఇచ్చాడు. ఇంతకీ ఈ అంపైర్ పేరు ఏంటంటారా..ఉల్లాస్ గాంధే, నాగ్‌పూర్‌కు చెందిన మాజీ క్రికెటర్. ఇతడు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు.
అట్లుంటది “ఇంపాక్ట్”

Related Post

వేదిక ఫిక్స్, డేట్స్ ఫిక్స్.. జెడ్డాలోవేదిక ఫిక్స్, డేట్స్ ఫిక్స్.. జెడ్డాలో
ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని, వేదికను కూడా ఖరారు చేసింది. ముందుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేయగా, ఇప్పుడు జెడ్డాకు

ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?ఇద్దరిలో ఎవరు? నలుగురిలో ఎవరు?
మరోకొన్ని గంటల్లో ముంబై ఇండియన్స్ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో తేలిపోతుంది. ఇప్పటికే మిగతా జట్లు కనీసం ఒకరిద్దరి విషయంలో క్లారిటీకి వచ్చినా, ముంబై ఇండియన్స్ మాత్రం ఏ చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా రోహిత్‌శర్మ ఆటగాడిగా కంటిన్యూ అవుతాడా

విజిల్ మోగట్లే..విజిల్ మోగట్లే..
చెన్నై సూపర్ కింగ్స్ , ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్..ఈ సీజన్‌లో నాసిరకం ఆటతీరు కనబరుస్తోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో చెన్నై చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి