లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్‌కు ఓపెనింగ్ జోడి వంద పరుగుల భాగస్వామ్యం అందించింది. తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించారు. గిల్ 60 రన్స్ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ జోడి కేవలం 58 బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌లో గిల్ హాఫ్ సెంచరీ చేయగా..ఆ తర్వాత మరో పది పరుగుల వ్యవధిలో సాయి సుదర్శన్ కూడా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ గిల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. గిల్‌కు 6 మ్యాచుల్లో ఇది రెండో హాఫ్ సెంచరి. ఇక సాయి సుదర్శన్ 32 బంతుల్లో ఫిఫ్టీ కంప్లీట్ చేయగా, అందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సాయి సుదర్శన్ ఆడిన 6 మ్యాచుల్లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. మిగతా రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌పై 5, ఆర్సీబీపై 49 రన్స్ చేశాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కు ఔటయ్యాడు.
వందేసి.. చిందేసిన జోడి

Categories: