గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హిమ్మత్ సింగ్‌ను రంగంలోకి దింపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ అరంగేట్రం చేశాడు. ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఆక్షన్‌లో హిమ్మత్‌సింగ్‌ను రూ.30 లక్షలకు దక్కించుకుంది. హిమ్మత్ గతేడాది చివర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో పెద్దగా రాణించకపోయినప్పటికీ..ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అతని ప్రతిభకు పట్టం కట్టారని చెప్పొచ్చు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా అదరగొట్టి ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ రైడర్ జట్టుకు ట్రోఫీ అందించాడు. అంతేకాదు ఈ లీగ్‌లో ఎక్కువ రన్స్ సాధించిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. పది మ్యాచుల్లో 381 రన్స్ చేయగా, అందులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. స్ట్రైక్ రేట్ 165 కంటే ఎక్కువగా ఉండటం ప్లస్ పాయింట్. మరి లక్నో సూపర్ జెయిట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఢిల్లీ బాయ్ కదా..కొంచెం ఆట, కొంచెం లోకల్ సెంటిమెంట్ కూడా ఉండొచ్చేమో మరి..తప్పు లేదులే.
ఎవరీ హిమ్మత్ సింగ్..?

Related Post

కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్కుప్పకూలిన పంజాబ్ బ్యాటింగ్
కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ 20 బంతుల్లో 39 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యను కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఔట్ చేశాడు.

ఇదేందయ్యా ఇది..163 ఏందయ్యాఇదేందయ్యా ఇది..163 ఏందయ్యా
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా తక్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, పవర్ ప్లేలో 64 రన్స్

లో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లేలో స్కోర్ థ్రిల్లర్‌లో బల్లేబల్లే
రెండొందలు..రెండొందలకు పైగా రన్స్‌ను ఛేజ్ చేసిన సందర్భాలు చూశాం..యమా థ్రిల్లింగ్ అనిపించాయి. మొన్న సన్‌రైజర్స్ పై 245 రన్స్ కాపాడుకోలేకపోయిన పంజాబ్..ఇప్పుడు కేకేఆర్‌పై 112 పరుగుల స్కోర్‌ను కాపాడుకుని ఇది అంతకుమించిన థ్రిల్ ఇచ్చింది. రికార్డ్ క్రియేట్ చేసింది. 112 రన్స్