థలా పగ్గాలు చేపట్టినా, సీఎస్కే తలరాత మాత్రం మారలేదు. కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. 5 సార్లు ఛాంపియన్‌గా గెలిచిన టీమ్..తమ సొంతగడ్డపై 20 ఓవర్లు ఆడినా 103 రన్స్ మాత్రమే చేయడమంటే..ఇంతకు మించిన ఘోర అవమానం మరొకటి ఉండదు. ఆ అవమానానికి బాధ్యత వహించేందుకు మహేంద్రుడు నాయకత్వం తీసుకున్నాడేమో, ఫాఫమ్. అన్నిటికీ మించి ధోని 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు రావడమనేది కూడా బ్లండర్ అనే చెప్పాలి. ఇన్నేళ్ల కీర్తి..అపకీర్తిగా మారకముందే మహేంద్రుడు మేలుకోవాలి. ఐతే ఒక్క ధోనినే నిందించడమూ కరెక్ట్ కాదు, లోపం కెప్టెన్‌దో, ప్లేయర్స్‌దో కాదు…టీమ్‌లో మునపటి వాతావరణం కనిపించడం లేదు..ఆ విన్నింగ్ స్పిరిట్ కనిపించడం లేదు..ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా లేదు. మొత్తానికి ఏదో మిస్పవుతోంది. సైకలాజికల్ విషయాలు పక్కన పెట్టి, ప్రాక్టికల్స్ మాట్లాడుకుంటే…ప్లేయింగ్ లెవన్ సరిగా కుదరడం లేదు. అన్నిటికీ మించి ముగ్గురు నలుగురు ఔట్ డేటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్, ఇది క్రికెటర్లను కించపరిచే ఉద్దేశం కాకపోయినప్పటికీ నిజం అదే.. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్..ఇలాంటి త్రీడీ ప్లేయర్లు అవసరమా..? పోనీ వాళ్లకేమన్నా అద్బుతమైన ట్రాక్ రికార్డ్ ఉందా, అంటే అదీ లేదు..భూతద్దం పెట్టి వెతికినా మ్యాచ్ విన్నర్ కనిపించడం లేదు..టీమ్‌లో ఎమ్ ఎస్ ధోని మ్యాచ్ విన్నరే..కానీ ఎన్ని దశాబ్దాలు ఆ బరువు మోయగలడు, జడేజా కూడా ప్రామినెంట్ క్రికెటరే..అతడూ మానవ మాత్రుడే కదా..శివమ్ దూబె కాసేపు దడదడలాడిస్తాడు, కానీ మ్యాచ్ విన్నర్ అనే గొప్ప హోదాకు అతడింకా అర్హుడు కాదు. ఫారిన్ ప్లేయర్స్ విషయానికొస్తే..రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఈ ఫార్మాట్‌లో కన్సిస్టెంట్ ప్లేయర్స్ కాదు..కాన్వే ఒక సీజన్ బాగానే ఇరగదీశాడు..రచిన్ వన్డే ఫార్మాట్‌లో తోపు, టీ20ల్లో ప్రతీసారి అంటే కష్టమే..ఫైనల్‌గా…సీఎస్కే గురించి ఒక మంచి విషయం చెప్పుకోవాలంటే, అది నూర్ అహ్మద్ గురించే..ఈ ఆఫ్గన్ స్పిన్నర్ ఒక్కడే కన్సిస్టెంట్‌గా రాణిస్తున్నాడు.
మ్యాచ్ విన్నర్ లేడు..ఆ ముగ్గురు అవసరమా?

Related Post

టికెట్ల గొడవ..పిచ్ ఇష్యూకి కారణమా?టికెట్ల గొడవ..పిచ్ ఇష్యూకి కారణమా?
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ చూసినవాళ్లెవరైనా సరే..పిచ్ గురించే మాట్లాడుతారు. స్లో వికెట్ లాగా అనిపించినప్పటికీ, గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయిన చోట, సన్‌రైజర్స్ బ్యాటర్లు ఎందుకు తేలిపోయారు. సాయి కిశోర్ వంటి స్పిన్నర్ సత్తాచాటిన చోట..సన్‌రైజర్స్

పవర్ ప్లే..దంచికొట్టారుపవర్ ప్లే..దంచికొట్టారు
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్నగుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ (82-0)ను నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ షమీ ఓవర్‌లో 5 ఫోర్లు, ఆ తర్వాత హర్షల్

క్లాసెన్ కాకా..కెవ్వు కేకక్లాసెన్ కాకా..కెవ్వు కేక
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ అందరూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖర్చు చేసిన ధర మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ బెస్ట్..అక్షరాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టినా, ఇప్పుడు అవే