Cricket Josh IPL గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా..

గుంటూరు కుర్రాడికి చాన్స్ ఇవ్వొచ్చుగా.. post thumbnail image

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, దాదాపుగా త‌మ ప్లేయింగ్ లెవ‌న్‌ను మార్చ‌దు. టీమ్ నిండా సీనియ‌ర్ ప్లేయ‌ర్సే ఉంటారు. డాడ్స్ ఆర్మీ అని పేరు కూడా ఉంది. ఐతే ఈ సీజ‌న్‌లో మిగ‌తా ఫ్రాంచైజీలు కుర్రాళ్ల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నాయి. దిగ్వేశ్‌, విఘ్నేశ్‌, ప్రియాన్ష్‌, స‌త్య‌నారాయ‌ణ రాజు..ఇలా చాలా మందే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కార‌ణంగా టోర్నీకి దూర‌మ‌వ‌డంతో ప్ర‌స్తుతం ఆ స్థానంలో ఎవ‌రిని ఆడిస్తార‌నేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ధోని నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నాడు క‌దా..
నిజానికి రాహుల్ త్రిపాఠి లేదా దీప‌క్ హుడాను ప్లేయింగ్ లెవ‌న్‌లో తీసుకోవ‌చ్చు. కానీ ఒక‌సారి బెంచ్ వైపు చూస్తే..తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్, త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స‌త్తాచాటిన ఆండ్రె సిద్ధార్థ్ క‌నిపిస్తారు.షేక్ ర‌షీద్ అండ‌ర్ 19 ప్రపంచ‌క‌ప్ 2022 గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆట‌గాడు. గుంటూరుకు చెందిన 20 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్..2023 నుంచి సీఎస్కే టీమ్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాడు. ఈ సీజ‌న్‌లో ఐనా అరంగేట్రం అవ‌కాశం ద‌క్కుంతుంద‌ని ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాడు. మ‌రి ఇవాళ కోల్‌క‌త నైట్‌రైడ‌ర్స్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో యంగ్‌స్ట‌ర్స్‌కు అవ‌కాశ‌మిస్తారా? లేదంటే సీనియ‌ర్ల వైపే మొగ్గు చూపుతారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించిన‌ట్టుగానే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్క‌లుంటాయి అవి ఇప్పుడు

వార్న‌ర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్వార్న‌ర్ రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్

ఐపీఎల్‌లో అత్య‌ధిక 50+ స్కోర్లు సాధించిన క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో కోహ్లీ 50+ స్కోర్ల సంఖ్య 67కు చేరింది. అంత‌కు ముందు ఈ రికార్డు డేవిడ్ వార్న‌ర్ పేరిట

కింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దేకింగ్స్ ఫైట్‌ పంజాబ్‌దే

పంజాబ్ కింగ్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య‌ జ‌రిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచ‌రీ సాయంతో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. వ‌రుస‌గా