క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు..ఒక క్యాచ్ వదిలేస్తే, అంది ఎంత కాస్ట్లీ అవుతుందనేది మనం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఆ విషయం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదార్‌కు బాగా అర్థమై, అనుభవమై ఉంటుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో వికెట్ కోల్పోయే అవకాశాన్ని పతిదార్ చేజేతులా తోసిపుచ్చాడు. కేఎల్ రాహుల్ 5 పరుగుల మీద ఉన్నపుడు ఇచ్చిన క్యాచ్‌ను రజత్ పతిదార్ జారవిడిచాడు. అక్కడ లైఫ్ పొందిన రాహుల్ మళ్లీ తప్పు చేయలేదు. నిలకడగా ఆడుతూ ఒకేసారి వేగం పెంచాడు. 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత జాస్ హేజిల్‌వుడ్ ఓవర్లో ఏకంగా 22 రన్స్ బాదాడు. దీంతో ఢిల్లీ టార్గెట్ వైపు మరింత వేగంగా దూసుకెళ్లింది. రాహుల్ 53 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో రెచ్చిపోయి 93 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఢిల్లీని గెలిపించాడు. ఒకవేళ రాహుల్ 5 పరుగుల వద్దే ఔటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మ్యాచ్ అనంతరం రజత్ ఈ విషయమై బాధ పడినప్పటికీ, ఆటలో ఇవన్నీ సహజమే గనుక..మరో మ్యాచ్‌కు ఫ్రెష్‌గా సిద్ధమవ్వాల్సిందే.
ఆర్సీబీ కెప్టెనే మ్యాచ్‌ను వదిలేశాడు

Related Post

టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్

ఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్ పెట్టాడుఓ రేంజ్‌లో కొట్టాడు…ఆరెంజ్ క్యాప్ పెట్టాడు
మొన్నటి మొన్న నికోలస్ పూరన్..సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఊచకోత, విధ్వంసం, ప్రళయం అన్నీ కలగలిపి సృష్టించిన విషయం గుర్తుంది కదా..తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక డీసెంట్ నాక్ ఆడాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్నాడు. అర్థమైంది కదా..ఈ లీగ్‌లో ఇప్పటి వరకు లీడింగ్

ఇదేందయ్యా ఇది..163 ఏందయ్యాఇదేందయ్యా ఇది..163 ఏందయ్యా
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా తక్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, పవర్ ప్లేలో 64 రన్స్