Cricket Josh IPL మాజీ టీమ్‌పై..క్లాసిక‌ల్ విధ్వంసం

మాజీ టీమ్‌పై..క్లాసిక‌ల్ విధ్వంసం

మాజీ టీమ్‌పై..క్లాసిక‌ల్ విధ్వంసం post thumbnail image

మాజీ టీమ్‌పై ఇర‌గ‌దీయ‌డం అనే ట్రెండ్ ఐపీఎల్‌లో కంటిన్యూ అవుతోంది. తాజాగా కేఎల్ రాహుల్‌, ఆర్సీబీ మాజీ ఆట‌గాడు..ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆడుతున్న ఈ క్లాసీ ప్లేయ‌ర్‌..ఒక అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడి త‌న జ‌ట్టును గెలిపించాడు. 164 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదిండంలో ఇబ్బందులు ప‌డుతున్న ఢిల్లీని ఆదుకున్నాడు. 30 ర‌న్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో క్రీజులో ఉన్న రాహుల్..కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (15), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (38*)తో క‌లిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టార్గెట్ దిశ‌గా తీసుకెళ్లాడు. అవ‌స‌ర‌మైన‌పుడు గేర్ మార్చి బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. మొత్తంగా 53 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాది 93 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.
అది కూడా ఆర్సీబీపై సొంత‌గ్రౌండ్‌లో. బెంగ‌ళూరు బాయ్ రాహుల్‌కు ఇది హెమ్ గ్రౌండ్‌. 2013లో ఆర్సీబీ త‌ర‌పునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆ త‌ర్వాత రెండు సీజ‌న్లు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆడాడు. ఇక 2016లో మ‌ళ్లీ ఆర్సీబీ త‌ర‌పున ఆడాడు. ఆ సీజ‌న్ ఆర్సీబీ ఫైన‌ల్‌కు కూడా చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత వివిధ ఫ్రాంచైజీల‌కు ఆడుతూ ..ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవ‌ర్‌లో తొలి సిక్స్ఇదేం పిచ్‌రా బాబు..18వ ఓవ‌ర్‌లో తొలి సిక్స్

ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. ఈ స్లో పిచ్‌పై స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు షాట్లు కొట్టేందుకు తెగ ఇబ్బంది ప‌డ్డారు. దానికి కార‌ణం స్లో పిచ్‌. పవ‌ర్ ప్లేలో

థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..థ‌లా..అన్‌క్యాప్డ్ ఐపోలా..

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఊహించిన‌ట్టుగానే ఐదుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ కోటాలో రిటైన్ చేసుకుంది. అందుకోసం రూ.4 కోట్లు చెల్లించింది. అంతేనా అని నోరెళ్లబెట్టొద్దు, చాలా లెక్క‌లుంటాయి అవి ఇప్పుడు

జాక్‌పాట్ ఖాయ‌మే?జాక్‌పాట్ ఖాయ‌మే?

గ్లెన్ ఫిలిప్స్‌..న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రిలీజ్ చేసిన ఆట‌గాడు. ఇత‌డు అలాంటి ఇలాంటి ఆల్‌రౌండ‌ర్ కాదు..లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో వ‌చ్చి సిక్స‌ర్లు బాద‌గ‌ల‌డు, స్పిన్‌ బౌలింగ్ వేసి వికెట్లు తీయ‌గ‌ల‌డు, మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుత‌మైన క్యాచ్‌లు ప‌ట్ట‌గ‌ల‌డు, వికెట్ కీపింగ్ కూడా