వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్..ఒక గుడ్ న్యూస్..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గైక్వాడ్ ఆడిన 5 మ్యాచుల్లో 122 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. గైక్వాడ్ కెప్టెన్సీ కంటే బ్యాటింగ్‌నే సీఎస్కే మిస్సవనుంది. గైక్వాడ్ స్థానంలో మహేంద్రసింగ్ ధోనిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్ నుంచీ ధోని నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే 9 స్థానంలో ఉన్న చెన్నైని ధోని తన కెప్టెన్సీ మ్యాజిక్‌తో గట్టెక్కిస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చివరిసారిగా ధోని 2023 ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేశాడు. ఆ సీజన్‌లో సీఎస్కేని ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా రుతురాజ్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. గత సీజన్‌లో సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సీజన్‌లోనూ టేబుల్‌లో బాటమ్‌లో ఉంది. మరి మాహీ మేనియా ఏం చేస్తుందో చూడాలి?
రుతురాజ్ ఔట్..కెప్టెన్‌గా ధోని

Related Post

అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్‌అయ్యారే.. వెంకటేశ్ అయ్యర్
ఆక్షన్‌లో దక్కిన భారీ ధర..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక సతమతమవుతున్నాడా? మెంటల్లీ, టెక్నికల్లీ అంత ఫిట్‌గా అనిపించడం లేదు. వెంకటేశ్ అయ్యర్, రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ వశమై అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం

భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్భారీ థ్రిల్లర్‌లో లక్నోదే లక్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిసింది.పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ (81) తో దుమ్మురేపగా, విధ్వంస ప్రేమికుడు నికోలస్ పూరన్ కేకేఆర్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు.

క్లాసెన్ కాకా..కెవ్వు కేకక్లాసెన్ కాకా..కెవ్వు కేక
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ అందరూ ఊహించిందే..ఐతే హెన్రిక్ క్లాసెన్ కోసం ఖర్చు చేసిన ధర మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ బెస్ట్..అక్షరాలు 23 కోట్ల రూపాయలు. ఇన్నాళ్లు భారీ మొత్తం అంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టినా, ఇప్పుడు అవే