ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆర్సీబీ ఆరంభించిన విధానం చూస్తే, ఇది చాలా తక్కువ స్కోరులా అనిపిస్తోంది. దూకుడుగా ఆరంభించి, పవర్ ప్లేలో 64 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ..ఆ తర్వాత కోహ్లీ (22), కెప్టెన్ పతిదార్ (25)ను కోల్పోవడంతో కష్టాల్లో పడింది. అనంతరం లివింగ్‌స్టన్, జితేశ్ కూడా సింగిల్ డిజిట్స్‌కే ఔటవడంతో స్కోరు వేగం మందగించింది. కృనాల్ (18) సహకారంతో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) ఆఖర్లో రెచ్చిపోయాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. డేవిడ్ ఈ రేంజ్‌లో ఆడితేనే ఆర్సీబీకి కనీసం 163 పరుగులైనా వచ్చాయి. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రజ్ చెరో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ మిడిల్ ఆర్డర్‌ని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ ఇద్దరూ 5 కంటే తక్కువ ఎకానమీతో రన్స్ ఇవ్వడం హైలైట్.
ఇదేందయ్యా ఇది..163 ఏందయ్యా

Categories:
Related Post

ధోని..ద ఫినిషర్..అంతేధోని..ద ఫినిషర్..అంతే
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులంతా ఎప్పుడెప్పుడె థలా ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ద ఫినిషర్ అనే ట్యాగ్ లైన్‌ను మళ్లీ గుర్తు

బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్బట్లర్ దంచుడు..ఆర్సీబీ హ్యాట్రిక్ మిస్
వరుసగా రెండు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో పరాభవం ఎదురైంది. గుజరాత్ టైటన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 169 రన్స్ చేసింది. ఓపెనర్లు

టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?టాస్ గెలిచి బౌలింగ్..కరెక్టేనా..?
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నట్టు కమిన్స్ తెలిపాడు. మరోవైపు గుజరాత్ టైటన్స్ ఒక మార్పు చేసింది. కరీమ్