Cricket Josh IPL ప‌టేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్

ప‌టేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్

ప‌టేల్ కెప్టెన్సీ..ముఖేశ్ అదుర్స్ post thumbnail image

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెన‌ర్లు ఫిల్‌సాల్ట్, విరాట్ కోహ్లీ. అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఓవ‌ర్‌లోనే బౌలింగ్‌కు దిగాడు. ఐన‌ప్ప‌టికీ స్కోర్ వేగం త‌గ్గ‌లేదు. ముఖ్యంగా సాల్ట్ ..మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవ‌ర్‌లో ఏకంగా 30 ప‌రుగులు స్కోర్ చేశాడు. నాలుగో ఓవ‌ర్‌లో మ్యాచ్ ట‌ర్న్ అయింది.కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ రెండో ఓవ‌ర్‌ కంటిన్యూ చేయ‌గా..ఫామ్‌లో ఉన్న ఫిల్‌సాల్ట్ అన‌వ‌స‌రంగా ర‌నౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ను ఢిల్లీ బౌల‌ర్లు ఇబ్బంది పెట్టారు. ప‌వ‌ర్‌ప్లే ఆఖ‌రి ఓవ‌ర్ (6వ ఓవ‌ర్‌)లో ముకేశ్ కుమార్‌ను రంగంలోకి దింప‌డంతో అత‌డు..ప‌డిక్క‌ల్‌ను ఔట్ చేసి ఆ ఓవ‌ర్‌లో ప‌రుగులేమీ ఇవ్వ‌లేదు. నాలుగు ఓవ‌ర్ల‌కే 60 ర‌న్స్ దాటిన ఆర్సీబీ..ప‌వ‌ర్ ప్లేను 2 వికెట్లు కోల్పోయి 64 ర‌న్స్‌తో ముగించిందంటే ఢిల్లీ ఏ రేంజ్‌లో క‌మ్‌బ్యాక్ అయిందో అర్థం చేసుకోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ర‌నౌట్‌పై గిల్ అసంతృప్తిర‌నౌట్‌పై గిల్ అసంతృప్తి

సూప‌ర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్ 38 బాల్స్‌లో 76 ర‌న్స్ చేసి ర‌నౌట్ అయ్యాడు. ఐతే థ‌ర్డ్ అంపైర్ ఇచ్చిన ర‌నౌట్ నిర్ణ‌యంపై గిల్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఔటైన అనంత‌రం డ‌గౌట్‌కు వెళ్తూ అక్క‌డున్న ఫోర్త్ అంపైర్

joss buttler willing to leave rajasthan royals says sources

బ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కేబ‌ట్ల‌ర్ వేలంలోకి వ‌స్తే..ఆ టీమ్‌కే

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెనింగ్ బ్యాట‌ర్ జాస్ బ‌ట్ల‌ర్‌..ఆ ఫ్రాంచైజీని వ‌దిలి ఆక్ష‌న్‌లోకి రావాల‌నుకుంటున్నాడ‌ట‌. ఒక‌వేళ అదే జ‌రిగితే ఈసారి జ‌ర‌గ‌బోయే మెగా ఆక్ష‌న్‌లో ఇత‌డికి జాక్‌పాట్ ద‌క్కే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ముఖ్యంగా మ్యాచ్ విన్న‌ర్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలు చాలా

SRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెల‌వాలిSRHకు దారేది?..10 మ్యాచ్‌లు..7 గెల‌వాలి

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస‌గా 3 మ్యాచ్‌లు ఓడిపోయి త‌మ ప్ర‌యాణాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4 మ్యాచుల్లో ఒకే ఒక్క గెలుపుతో 2 పాయింట్ల‌తో ఉంది. స‌న్‌రైజ‌ర్స్‌కు ఇంకా 10 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక‌వేళ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే