Cricket Josh IPL గురిత‌ప్ప‌ని గుజ‌రాత్

గురిత‌ప్ప‌ని గుజ‌రాత్

గురిత‌ప్ప‌ని గుజ‌రాత్ post thumbnail image

గుజ‌రాత్…ఆవా దే (గుజ‌రాతీ భాష‌లో తీసుకురండి)..వాళ్ల ట్యాగ్‌లైన్‌కు త‌గ్గ‌ట్టుగానే మ‌రో 2 పాయింట్ల‌ను తీసుకొచ్చింది. టైట‌న్స్ వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసింది. సొంత‌గడ్డ‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వార్ వ‌న్ సైడ్ చేసేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసి 20 ఓవ‌ర్ల‌లో 216 ప‌రుగుల భారీ స్కోరు న‌మోదు చేసింది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ 82 ర‌న్స్ చేయ‌గా, మిడిల్ ఆర్డ‌ర్‌లో బ‌ట్ల‌ర్, షారుక్ చెరో 36 ర‌న్స్ చేశారు. చివ‌ర్లో రాహుల్ తెవాటియా 12 బాల్స్‌లో 24 నాటౌట్ , ర‌షీద్ ఖాన్ 4 బాల్స్‌లో 12 ర‌న్స్ తో మెరుపులు మెరిపించ‌గా, రాయ‌ల్స్ భారీ స్కోరు సాధించింది.
217 పరుగుల టార్గెట్‌ను ఛేదించ‌డంలో బ‌రిలోకి దిగిన రాయ‌ల్స్ ఆది నుంచే ఇబ్బందులు ప‌డింది. జైస్వాల్, నితీశ్‌, జురేల్ సింగిల్ డిజిట్స్‌కే ఔట‌య్యారు. సంజూ శాంస‌న్ 41, ప‌రాగ్ 26 చేసి క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. షిమ్ర‌న్ హెట్‌మెయిర్ హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో రాయ‌ల్స్ క‌నీసం 150 ప‌రుగులైనా దాట‌గ‌లిగింది. రాయ‌ల్స్ ఇన్నింగ్స్ 159 ప‌రుగుల వ‌ద్ద ముగిసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ కృష్ణ 3 వికెట్లు తీయ‌గా, ర‌షీద్ ఖాన్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు ద‌క్కించుకున్నారు. ఈ గెలుపుతో గుజ‌రాత్ టైట‌న్స్ 8 పాయింట్ల‌తో టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్భారీ థ్రిల్ల‌ర్‌లో ల‌క్నోదే ల‌క్

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బౌండ‌రీల వ‌ర్షం కురిసింది.ప‌రుగుల వ‌ర‌ద పారింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌లో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ హాఫ్ సెంచ‌రీ (81) తో దుమ్మురేప‌గా, విధ్వంస ప్రేమికుడు నికోల‌స్ పూర‌న్ కేకేఆర్ బౌల‌ర్ల‌పై సునామీలా విరుచుకుప‌డ్డాడు.

మామ‌ను మిస్ చేసుకోవ‌ద్దుమామ‌ను మిస్ చేసుకోవ‌ద్దు

ఐపీఎల్ మెగా ఆక్ష‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రిలీజ్ చేసిన ఆట‌గాళ్ల‌లో ఏడెన్ మార్క్‌ర‌మ్ కూడా ఉన్నాడు. తెలుగు అభిమానులు ముద్దుగా మార్క్‌ర‌మ్ మామ అని పిలుచుకునే ఈ సౌతాఫ్రికా కెప్టెన్‌..బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద‌ర‌గొట్టాడు. మంచి రికార్డ్ ఉన్న ఇత‌డిని స‌న్‌రైజ‌ర్స్

అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌అయ్యారే.. వెంకటేశ్‌ అయ్య‌ర్‌

ఆక్ష‌న్‌లో ద‌క్కిన భారీ ధ‌ర‌..ఒత్తిడికి గురి చేస్తోందా? ఫామ్‌లో లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడా? మెంట‌ల్లీ, టెక్నిక‌ల్లీ అంత ఫిట్‌గా అనిపించ‌డం లేదు. వెంక‌టేశ్ అయ్య‌ర్‌, రూ. 23.75 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ వ‌శ‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కానీ మ్యాచుల్లో ఏ మాత్రం