ఆఫ్గన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్..ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ తనుంటాడు. లెక్కలేనన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ రషీద్‌ఖాన్‌కు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్ గ్యారెంటీ. కానీ ఈ సీజన్‌లో సీన్ మారింది. రషీద్ ఈ మ్యాచ్‌లో ఐనా వికెట్ తీస్తాడా అనేలా అతడి ఫామ్ పడిపోయింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా..తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడు మ్యాచుల్లోనూ వికెట్లేమీ దక్కలేదు. పోనీ రన్స్ కట్టడి చేశాడా అంటే అదీ లేదు. ఐతే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ఖాన్‌కు కాస్త ఊరట లభించింది. మూడు మ్యాచ్‌ల తర్వాత మళ్లీ వికెట్ దక్కింది. ధృవ్ జురేల్‌ను ఔట్ చేయడం ద్వారా వికెట్ల లోటును భర్తీ చేసుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ 14వ ఓవర్లో శుభమ్ దూబెను కూడా ఔట్ చేసి ..మొత్తానికి ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.
రషీద్ వికెట్ తీశాడోచ్..

Categories:
Related Post

ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?ఫామ్‌లో లేని రషీద్‌ను ఫామ్‌లోకి తెస్తారా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్…రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్‌లో కీలక స్పిన్నర్. ఐతే ఇతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు గుజరాత్ మూడు మ్యాచులు ఆడగా..రషీద్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. అది

కింగ్స్ ఫైట్ పంజాబ్‌దేకింగ్స్ ఫైట్ పంజాబ్‌దే
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ సాయంతో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. వరుసగా

వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?వెళ్లిపోతున్న ట్రావిస్ హెడ్ ?
సన్‌రైజర్స్ హైదరాబాద్ డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. వ్యక్తిగత కారణాల వల్ల హెడ్ ఆసీస్‌కు పయనమయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ హెడ్ రాబోయే మ్యాచ్‌లకు మిస్సైతే సన్‌రైజర్స్‌కు కోలుకోలేని దెబ్బపడినట్టే. ఇప్పటికే ఆడిన మూడు