ఈ సీజన్‌లో నికోలస్ పూరన్, విరాట్ కోహ్లీ, మిచెల్ మార్ష్…ఇలా మాంచి హిట్టర్ల గురించే మాట్లాడుకుంటున్నాం గానీ..వీళ్లకు ఏ మాత్రం తీసిపోని మరో ప్లేయర్ గురించి కాస్త తక్కువగానే మాట్లాడుకుంటున్నాం. అతడే మిస్టర్ కన్సిస్టెంట్, అసాధారణ ప్రతిభ ఉన్న బ్యాటర్ సాయి సుదర్శన్. చాపకింద నీరులా తనపని తాను చేసుకుపోతూ హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లో..వరుసగా 74, 63, 49, 5, 82 రన్స్ చేశాడు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్, అందుకే అండర్ రేటెడ్ ప్లేయర్‌గా నిలుస్తున్నాడు. కానీ తానేంటో బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రెండో వికెట్‌కు బట్లర్‌తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం, మూడో వికెట్‌కు షారుక్‌తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. గుజరాత్ రెండొందలకు పైగా (217) స్కోరు సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు.
ఈ కుర్రాణ్ని మీరు గమనించట్లే గానీ..

Related Post

మామను మిస్ చేసుకోవద్దుమామను మిస్ చేసుకోవద్దు
ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఏడెన్ మార్క్‌రమ్ కూడా ఉన్నాడు. తెలుగు అభిమానులు ముద్దుగా మార్క్‌రమ్ మామ అని పిలుచుకునే ఈ సౌతాఫ్రికా కెప్టెన్..బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టాడు. మంచి రికార్డ్ ఉన్న ఇతడిని సన్‌రైజర్స్

ఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందేఫామ్‌లో ఉన్నాడు..ఫేట్ మారాల్సిందే
ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు టైమ్ దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఐతే ఆక్షన్‌లో లిస్ట్ అయిన తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది కేఎస్ భరత్ గురించి. 2015లోనే

ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫారిన్ ప్లేయర్స్ జాక్‌పాట్ కొట్టడం చాలా సార్లు చూశాం. మరి ఈసారి మెగా ఆక్షన్‌లో ఎవరు ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌గా రికార్డు సృష్టిస్తారో ఒక అంచనా వేద్దాం. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20