మాజీ టీమ్‌లపై ప్లేయర్స్ పగబట్టినట్టుగా పెర్ఫార్మ్ చేయడం ఐపీఎల్‌లో ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ లక్నో తరపున ఆడుతూ..తమ మాజీ టీమ్ సన్‌రైజర్స్‌పై ఇరగదీశారు. మొన్నటికి మొన్న గుజరాత్‌కు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ తన మాజీ టీమ్ సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఆడుతున్న పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్..తన మాజీ టీమ్ ఆర్సీబీపై విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే ఉంది. మరి ఇప్పుడు గుజరాత్‌కు ఆడుతున్న జాస్ బట్లర్, గత సీజన్ వరకూ రాజస్థాన్ రాయల్స్‌కు ఆడినవాడే. అంతేకాదు ఆ టీమ్ తరపున సెంచరీలు బాది..ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు ఎన్నో. మరి ఐపీఎల్ ట్రెండ్ ప్రకారం బట్లర్ తన మాజీ టీమ్ రాయల్స్‌పై విధ్వంసం చేయడం ఖాయమే అనిపిస్తోంది. అసలే ఫామ్ కోసం ఎదురుచూస్తున్న బట్లర్‌కు ఇదే రైట్ టైమ్. ఇక గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ కూడా గత సీజన్ వరకూ రాయల్స్‌కే ఆడాడు. మరి ఇతడు కూడా మాజీ టీమ్‌పై అద్బుతమైన బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఏదేమైనా రాజస్థాన్ రాయల్స్ తమ మాజీ ప్లేయర్స్‌పై ఓ లుక్కేయాల్సిందే. ఈ జాబితాలో రాహుల్ తెవాటియా కూడా ఉన్నాడండోయ్..మరి అతడికైతే బ్యాటింగ్ అవకాశాలు పెద్దగా రావట్లే, ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో తన మాజీ టీమ్ రాయల్స్‌కు బాగా తెలుసు.
బట్లర్ రెడీ..రాయల్స్ బీ కేర్ ఫుల్

Related Post

నితీశ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌నితీశ్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్
బీసీసీఐ ప్రతి ఏడాది ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో..2024-25 ఏడాదికి సంబంధించి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి చోటు దక్కింది. ఇక గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్టు దక్కని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు ఈసారి మళ్లీ

ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?ఈ ఫారిన్ సరుకు ధర ఎంతో?
ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఫారిన్ ప్లేయర్స్ జాక్‌పాట్ కొట్టడం చాలా సార్లు చూశాం. మరి ఈసారి మెగా ఆక్షన్‌లో ఎవరు ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్స్‌గా రికార్డు సృష్టిస్తారో ఒక అంచనా వేద్దాం. గతేడాది మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే 20

రివేంజ్ కాదు..రేంజ్ సరిపోలేరివేంజ్ కాదు..రేంజ్ సరిపోలే
గత సీజన్‌లో మూడుసార్లు కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్..ఈ సీజన్‌లోనూ కేకేఆర్ చేతిలో చిత్తైంది. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకుంటే..తమ రేంజ్ సరిపోలేదంటూ మరోసారి ఓడిపోయింది. బౌలర్లు మరోసారి నిరాశపరుస్తూ ప్రత్యర్థి కేకేఆర్‌కు 200 రన్స్ సమర్పించుకున్నారు.